నా చావుకు కారణం ఆ ముగ్గురే...సూసైడ్ నోట్ లో విస్తుపోయే నిజాలు...మైనర్ బాలిక ఆత్మహత్య...

నా చావుకు కారణం ఆ ముగ్గురే
సూసైడ్ నోట్ లో విస్తుపోయే నిజాలు
మైనర్ బాలిక ఆత్మహత్య

VS9TV న్యూస్,రాజన్న సిరిసిల్ల :
మైనర్ బాలికను ముగ్గురు మానవ మృగాలు కత్తులతో బెదిరించి,లైంగిక దాడి చేసి,వీడి యోలు చిత్రీకరించి వేధించిన ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నాయి...రాజన్న సిరి సిల్ల జిల్లా,ఇల్లంతకుంట మండలం,రంగంపేట గ్రామంలో తమ కూతురు అనారోగ్యంతో మరణించిందని బాధపడిన తల్లిదండ్రులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.తమ కూతురు రాసుకున్న సూసైడ్ నోట్ దొరకడంతో,ఆమె ఫోనులో ఉన్న వీడియోలు,ఫోటోలు వెతికి చూసి షాక్ అయ్యారు.ఇంట్లో ఎవరు లేని సమయంలో గాలిపల్లి గ్రామానికి చెందిన ము గ్గురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కత్తులతో బెదిరిస్తూ,లైంగిక దాడి చేసి,వీడియోలు చిత్రీకరిం చారని బాలిక తండ్రి ఆరోపించారు.ఎవరికైనా చెబితే వీడియోలు బయటకు వదులుతా మని రెండు సంవత్సరాలుగా బాలికను నిందితులు చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించి మైనర్ బాలిక మరణించింది.ఆ ముగ్గురు మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి డిమాండ్ చేశాడు.

Comments