వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు...
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపా నికి పాల్పడ్డారా?అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫి ర్యాదు చేయొచ్చు.కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్ చాట్ బాట్’ సేవలను తీసుకొచ్చింది.వాట్సప్ నంబర్ 88000 01915లో మొదట హాయ్ అని టైప్ చేయాలి.అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగ దారుల కమిషన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది.
అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిష న్‌కు పంపుతారు.కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు,సూచనలు ఇ స్తారు.దీంతో పాటు 1800114000 లేదా 1915 నంబర్‌కు కాల్ చేసి సైతం (ఉద యం 8-00గంటల నుంచి రాత్రి 8-00గంటల వరకు) ఫిర్యాదు చేయొచ్చు.ప్రతి రోజూ వేల ఫిర్యాదులు నమోదవుతుండగా,అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వి వరాలను కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ https:/consumerhelplin e.gov.in/ వెబ్‌సైట్‌లో ఎన్‌సీహెచ్ సక్సెస్ స్టోరీస్ పేరుతో పొందుపరుస్తోంది.
Comments
Post a Comment