సమాజానికి చేతనంత సేవచేయాల్సిన అవసరముంది...ఆచార్య వి.వెంకట బసవరావు, రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్....
సమాజానికి చేతనంత సేవచేయాల్సిన అవసరముందివి.వెంకట బసవరావు,రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య
సమాజం నుండి వివిధ సౌకర్యాలను పొందుతున్న ప్రతిఒక్కరూ తిరిగి సమాజానికి చేత నంత సేవచేయాల్సిన అవసరముందని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆ చార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు.జాతీయ సేవాపథక దినోత్సవాన్ని పురస్క రించుకొని బుధవారం యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో జరిగిన స మావేశానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణ,అటవీ మరియు వాతావరణ శాఖవారు సేవాపర్వ్ కార్యక్రమంలోభాగంగా వాయుకాలుష్య నివారణ,ప్లాస్టి క్ వ్యర్థాల నిర్మూలన, వినియోగాన్ని తగ్గించుట,సమర్ధవంత మైన నిర్వహణల గురించి వి విధ కార్యక్రమాలకు రూపకల్పనచేసి దేశవ్యాప్తంగా వివిధ సంస్థల సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పించడం హర్షణీయమన్నారు.పర్యావరణ విద్య,అవగాహన పరిశోధన మ రియు నైపుణ్యశిక్షణలను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తున్నారన్నారు. అందులో భాగంగా వాయుకాలుష్యం–ప్లాస్టిక్ వ్యర్థాలగురించి అవగాహనా కార్యక్రమాన్ని రాయల సీమ యూనివర్సిటీలో నిర్వహించడం సంతోషకరమన్నారు.ఈ సందర్భంగా పాండిచ్చేరి కేంద్ర విశ్వవిద్యాలయం నుండి విచ్చేసిన ఎస్.పనీర్ సెల్వం,ఎస్.దినేష్ లను వైస్ ఛాన్స్ ల ర్ అభినందించారు.కార్యక్రమంలో ప్రసంగించిన వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్.టి.కె.నా యక్ జాతీయ సేవా పథక విశిష్టతను వివరించారు.వర్సిటీ క్యాంపస్ తోపాటు అనుబంధ కాలేజీల్లో కూడా ఈ రకమైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయ మని రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు హర్షం వ్యక్తంచేశారు.వర్సిటీలో క్ర మం తప్పకుండా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్ ఎస్ ఎస్ విభాగాన్ని ప్రిన్సిపాల్ ఆచార్య సి.వి.కృష్ణారెడ్డి అభినందించారు.కార్యక్రమ లక్ష్యాలను,జాతీయ సేవా పథక ప్రాధాన్యాన్ని వర్సిటీ ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.నాగరాజు వివరించారు. ఈ సందర్భంగా “క్లీన్ ఎయిర్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీసిటీ” అనే అంశంపై యూనివర్సిటీ విద్యా ర్థులకు నిర్వహించిన వ్యాసరచన,డ్రాయింగ్ పోటీల విజేతలకు వి.సి ప్రశంసాపత్రాలు అం దజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్.ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె.వెంకట రత్నం,డా క్టర్ బి.విజయుడు,డాక్టర్ నాగచంద్రుడు,శివప్రసాదరెడ్డితోపాటు విద్యార్థినీ,విద్యార్థులు,అ ద్యాపకులు,బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment