ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి...ఆప్టా...

ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ నుంచి మినహాయింపు 
కోరుతూ ప్రభుత్వం తరుపున సుప్రీం కోర్టులో 
రివ్యూ పిటిషన్ వేయాలి...ఆప్టా

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
సుప్రీం కోర్టు 2025,సెప్టెంబర్,1న వెలువరించిన తీర్పులో భారతదేశంలోని అన్ని రాష్ట్రా ల ఉపాధ్యాయులు(ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నవారు) రిటైర్మెంట్ కి ఐదు లోపు ఉన్నవారు మినహా అందరూ తీర్పు వెలువరించిన రెండు సంవత్సరాలలో తప్పనిసరిగా టీచర్స్ ఎలి జిబులిటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే సర్వీస్ లో కొనసాగటం,లేదా పదోన్నతి పొంద టం జరుగుతుంది అని తీర్పు ఇచ్చింది.ఇప్పటి వరకూ ఈ విషయంలో సర్వీస్ లో ఉన్న ఉపా ద్యాయులకు మినహాయింపు నివ్వాలని కోరుతూ చాలా రాష్ట్రాలు,అప్తా సంఘంతో పాటు ఇతర సంఘాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ లు వేశాయని ఏపి ప్రైమరీ టీచర్స్ అసో సియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షులు ఎజిఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్ర కాష్ రావులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అయితే ఇంతవరకూ మన రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయలేదు.మరోవైపు టెట్ నోటిఫికేష న్ విడుదల చేయడం జరగటంతో ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో ఉన్నారని అన్నా రు.ఈ విషయంను ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి తెలి యచేస్తూ లేఖ ద్వారా ప్రాతినిధ్యం చేశామన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి కో సం నిరంతరం కృషి చేస్తున్న నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యా యులకు ప్రభుత్వం తరపున టెట్ విషయంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని హామీ ఇస్తూ,అధికారులకు తగుచర్యలు నిమిత్తం ఆదేశాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులకు మనో ధైర్యం కల్పిస్తారని,వారి యొక్క మానసిక ఆందోళ నను తొలగిస్తారని ఎపి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) పక్షాన నారా లోకేష్ బా బుని వారు కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...