మత్స్యశాఖ మహిళా అధికారిపై రూ.48 లక్షల మోసం కేసు నమోదు...

మత్స్యశాఖ మహిళా అధికారిపై 

రూ.48 లక్షల మోసం కేసు నమోదు

VS9TV న్యూస్,విజయవాడ :
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని,అధిక లాభాలు ఇస్తానని చెప్పి చిన్ననాటి స్నేహితురాలిని రూ.48లక్షలకు మోసం చేసిన కేసులో గుంటూరు మత్స్యశాఖ సూపరింటెండెంట్ నిమ్మ కాయల లలిత కుమారిపై అజిత్‌సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నిందితు రాలితో పాటు ఆమె భర్త జాన్సన్‌పై కూడా మోసం, నమ్మక ద్రోహం,క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు.డబ్బు తిరిగి అడిగితే బాధితురాలిని చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.బాధితురాలు నంద మూరి నగర్,విజయవాడకు చెందిన షేక్ షమీమ్ (50).ఆమె ఫిర్యాదు మేరకు,నిమ్మకా యల లలిత కుమారి చిన్ననాటి స్నేహితురాలు కాగా,గుంటూరు మత్స్య శాఖలో సూప రింటెండెంట్‌గా పనిచేస్తున్నారు.లలిత కుమారికి ఉన్నతాధికారులతో పరిచయాలు ఉ న్నాయని,తమ కుమార్తెకు మత్స్యశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 23,సెప్టెంబర్‌లో రూ.20లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.తర్వాత లలితకు మారి తన భర్త,అల్లుడికి విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని,పాస్టరల్ పనుల కోసం అ త్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి మరో రూ.28లక్షలను హ్యాండ్ లోన్‌గా తీసుకున్నా రని బాధితు రాలు పేర్కొన్నారు.అవసరమైతే మొత్తం కోటి తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన ట్లు చెప్పారు.తరచూ ఉద్యోగం,డబ్బు రీ పేమెంట్ గురించి అడిగినప్పుడు సరైన సమాధా నాలు ఇవ్వకుండా తప్పించుకున్నారని,చివరకు చంపేస్తామని బెదిరించ డంతో పోలీసు లను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో ఉంది.ఈ కేసులో బ్యాంకు లావాదేవీలు,ఇతర కుటుం బ సభ్యుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...