వీది కుక్కల భారీ నుండి ప్రజలకు రక్షణ కల్పించండి...సిపిఎం...

వీది కుక్కల భారీ నుండి ప్రజలకు రక్షణ కల్పించండి
సిపిఎం

VS9TV న్యూస్,కొత్తపల్లి :
ఆత్మకూరు,కొత్తపల్లి మండలంలో వీదికుక్కలు ప్రజలు,పశువులపై దాడి చేస్తున్నాయి.కు క్కల దాడికి గురైన పశువులు రాబిస్ వ్యాధి సోకి చనిపోతున్నాయని,అధికారులు వీధి కుక్కల బారి నుండి ప్రజలకు పశువులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని సిపిఎం జి ల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఏసురత్నం,మండల కార్యదర్శి ఎన్.స్వాములు డిమాండ్ చే శారు.ఈ మేరకు కొత్తపల్లి మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ మండల కేంద్రంతో పా టు లింగాపురం,శివపురం,సింగరాజు పల్లె,గోకవరం,తదితర గ్రామాల్లో వీధికుక్కలు ఎక్కు వై ప్రజల పైన దాడి చేస్తున్నాయి.కుక్కలు గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ ద్విచ క్ర వాహనదారులపై,ఒంటరిగా వెళుతున్న మహిళలు,చిన్నపిల్లలపై దాడి చేసి గాయపరు స్తున్నాయి.కుక్కల భయంతో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.సింగరాజు పల్లి గ్రామంలో కుక్కల దాడికి గురై ఎద్దులు,బర్రెలు,ఆవులు మృతి చెందాయన్నారు.కుమ్మరి వెంకటస్వామికి చెందిన రూ.70వేల విలువ కలిగిన ఎ ద్దు,నక్క రమేష్ కు చెందిన పాలిచ్చే బర్రె,నక్క దావీదుకు చెందిన బర్రెదూడ కుక్కకాటుకు గురై గతంలో మృతి చెందాయి.ఈ మధ్యకాలంలో మారేడు యోహానుకు చెందిన ఆవు కు క్క కాటు గురై రాబిస్ వ్యాధి చెందిందని తెలిపారు.రాబిస్ వ్యాధి నివారణ కోసం పశువు లకు వ్యాక్సిన్లు వేయించినప్పటికీ పశువులు చనిపోతున్నాయని పంచాయతీ అధికారు లు ఎంపీడీఓ సంబంధిత అధికారులు కుక్కల భార్య నుండి ప్రజలను,పశువులను కాపా డేందుకు చర్య లు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

Comments