మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం...ఎం.డి.ఆనంద్ బాబు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు...

మండల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం
ఎం.డి.ఆనంద్ బాబు,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు

VS9TV న్యూస్,కర్నూలు మండలం :
సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.నవంబర్ 23,24వ తేదీలలో కర్నూలు మండల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం కర్నూలు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి హుస్సేనయ్య అధ్యక్షతన జీవుజాత కార్య క్రమం చేపట్టారు.జీపు జాత ప్రారంభం సందర్భంగా దేవమాడ గ్రామంలో ఆదివారం సిపి ఎం జిల్లా కార్య దర్శి వర్గ సభ్యులు ఎం.డి.ఆనంద్ బాబు జెండా ఊపి ప్రారంభించారు.అ నంతరం ఆనంద్ బాబు మాట్లాడుతూ కర్నూలు మండలాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.గత ప్రభుత్వంలో అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు కూటమి ప్ర భుత్వంలోనైనా పరిష్కారం అవుతాయని విశ్వసించారని అన్నారు.కానీ నేటికీ ఆ సమస్య లు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోతున్నారని అన్నారు.ప్రభు త్వం ఏర్పడి 17నెలలైనా ఇప్పటికీ ఆర్కే దుద్యాల గ్రామానికి,ఎదురూరు,తొలిషాపురం గ్రా మాలకు రోడ్లు వేయలేదన్నారు.ఆర్కే దుద్యాల,గొందిపర్ల గ్రామలలో డ్రైనేజీ వ్యవస్థ లేక అ స్తవ్యస్తంగా ఉందన్నారు.తొలిసాపురం గ్రామంలో ఉప్పునీటిని తాగాల్సిన పరిస్థితి ఉంద న్నారు.వెంటనే ఆ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.అలాగే ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవడానికి ప్రకటించిన హెక్టర్ కు రూ.50వేలు ఇప్పటికి అందచేయ కపోవడంతో రైతులు ఎంతో ఆవేదనతో ఉన్నారని తెలియజేశారు.ఉల్లి రైతులను ఆదుకో వడం కోసం ప్రభుత్వం చేస్తామన్న సహాయం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ పూర్తి చేసి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన సిపిఎం చేపడు తుందని హెచ్చరించారు.అనంతరం గొందిపర్ల, తాండ్రపాడు,పంచలింగాల,నిర్జూరు,సింగవరం,ఎదురూరు,తొలిసాపురం,ఆర్కే దుద్యాల, కొంతలపాడు,సుంకేసుల,ఉల్చాల వరకు జీపు జాత కొనసాగించారు.ఈ జీపు జాత కా ర్యక్రమంలో మండల నాయకులు రాఘవేంద్ర,శ్రీరాములు,బాలపీరా,ఆంజనేయులు,మధు, హరి,కిషన్ రెడ్డి,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...