ఫిబ్రవరి,12వ తేదీన జరుగు సార్వత్రిక స మ్మెలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కార్మికులు పా ల్గొనాలి...బిజెపి భజన కొడుతున్న రాష్ట్ర పార్టీలను తరిమికొట్టాలి...సిఐటియు పిలుపు...

ఫిబ్రవరి,12వ తేదీన జరుగు సార్వత్రిక సమ్మెలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కార్మికులు పాల్గొనాలి
బిజెపి భజన కొడుతున్న రాష్ట్ర పార్టీలను తరిమికొట్టాలి 
సిఐటియు పిలుపు

VS9TV న్యూస్,కల్లూరు :
దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గపు ప్రజా వ్యతిరేకవిధానాల్లో భాగంగా అ మలు చేస్తున్న లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి,12వ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని సిఐటియు నాయకులు తెలిపారు.శనివారం ఇండ స్ట్రియల్ ఎస్టేట్ లోని ఏపీ సీడ్స్,నేషనల్ సీడ్స్ మే నేజర్లు,ఫ్యాక్టరీ యాజమాన్యాలు,ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు యూని యన్ నాయకులు కలిసి సమ్మె నోటీసులు అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు నగర కోశాధికారి సి.హెచ్.సాయిబాబా,నగర ఉపాధ్యక్షులు కే.సుదాకరప్ప మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్లు వల్ల కార్మిక వర్గానికి తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.ఇప్పటికే కార్మికులు కనీస వేతనాలు లేక సరైన భద్రత,ఈఎ స్ఐ,పిఎఫ్ లాంటి చట్టాలు అమలు కాకుండా కార్మికులను వెట్టిచాకిరి చేయించుకుంటు న్నారని ఆవేదన చెందారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లు వల్ల కా ర్మికులకు ఉన్న హక్కులు హరించి వేసే ప్రమాదం ఉందన్నారు.కనీస వేతనాలు చట్టం, బోనస్ చట్టం,ఈఎస్ఐ,పీఎఫ్ వంటి చట్టాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.అనేక చి న్న చిన్న ఫ్యాక్టరీలో ఇప్పటికే 10-00 గంటలు నుండి 12-00 గంటల వరకు పనిని చే యించుకుంటూ,చాలిచాలని వేతనాలు ఇస్తూ యజమానులు దోపిడీకి పాల్పడుతున్నట్లు చెప్పారు.దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరించే విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధ రలు విపరీ తంగా పెరిగి,చాలీచాలని వేతనాలతో కార్మికులు తమ కుటుంబాలను పో షించుకునే దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నా రు.ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసు కువచ్చిన లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.అలా గే 200 5లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టానికి తూట్లు పొడిచి,వికసిత్ భారత్ రాంజీ పేర్లతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయ డానికి బిజెపి కుట్రలు సాగిస్తుందని,దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పనులు చేసు కుంటున్న కార్మిక వర్గానికి ఈ చట్టం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్య క్తం చేశారు.2005లో అమలైన మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించా లని,నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి,పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాం డ్ చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసి రాష్ట్ర కార్మిక వర్గానికి ఉపయోగ పడాల్సిన కూటమి ప్రభుత్వం పార్టీలు టిడిపి,జనసేన పార్టీలతోపాటు,ప్రతి పక్షంలోని వై సీపీ ప్రభుత్వం సైతం బీజేపీ భజన చేస్తున్నాయని,స్వార్థపు పార్టీలను తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఆ బాధ్యత కార్మిక వర్గం బాధ్యత తీసుకోవాలని పేర్కొ న్నారు.కావున ఫిబ్రవరి,12వ తేదీన జరుగు సమ్మెలో కార్మిక సమాజం పెద్దఎత్తున పా ల్గొని జయప్రదం చేయాలని వారు కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియ ల్ ఎస్టేట్ ఈ.శ్రీనివాసులు,మౌలాలి,పెద్ద మధు,హనుమంతు,ఇతర కార్మికులు పాల్గొన్నా రు.

Comments