తెలుగు సినిమాకు ఎర్ర రేఖ...ప్రజల కోసం జీవిస్తున్న ఒంటరి రాజు...ఆర్.నారాయణ మూర్తి వినూత్న సినీ ఒరవడి...
తెలుగు సినిమాకు ఎర్ర రేఖ
ప్రజల కోసం జీవిస్తున్న ఒంటరి రాజు
పేద రైతు బిడ్డ నుండి ప్రజా స్వరం వరకు
చెట్ల నీడలో మొదలై చరిత్రగా మిగిలిన ప్రయాణం
ఆడంబరాలకు అతీతంగా తన ప్రజా జీవితం
విప్లవమే వినోదంగా ఆర్.నారాయణ మూర్తి వినూత్న సినీ ఒరవడి
తెలుగు సినిమా నటుడు,దర్శకుడు.ఎర్ర సైన్యం,చీమలదండు మొదలైన విప్లవ ప్రధానమైన సినిమాల నిర్మాత,నటుడు, హేతువాది,అవివాహితుడు,"పీపుల్స్ స్టార్" ఆర్.నారాయణమూర్తి జీవిత విశేషాలు...రెడ్డి నారాయణమూర్తి, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో 19 53,డిసెంబర్,31న జన్మించారు.అమ్మ పే రు రెడ్డి చిట్టెమ్మ,నా న్న పేరు రెడ్డి చిన్న య్య నాయడు.వీరిది అతి సాధారణ రైతు కుటుంబం.రౌతుల పూడిలో 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నత నం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీ యార్,నాగేశ్వరరావుల సినిమాలు చూసి,విరామ సమయంలో వారిని అనుకరించేవాడు.అక్కడే తన నటనా జీవితానికి పునాది పడిందని చెప్పుకున్నాడు.శంఖ వరంలో ఉన్నత పాఠశాలలో చేరాడు.అక్కడే నారాయణ మూర్తికి సామాజిక స్పృహ కలిగింది.సా మాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి,విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షి తుడయ్యాడు.
నారాయణమూర్తి సినిమాల్లో హీరో కావా లనే జీవితాశయం ఉండేది.సినిమా పిచ్చి తో 1972లోనే ఇంటర్మీడియట్ పరీ క్షల వ్వగానే ఎలాగైనా పరీక్షలో తప్పేది ఖా యం అనుకుని మద్రాసు వెళ్ళిపోయా డు.అప్పటికి ఇతడికి 17-18 ఏళ్ళ వయ సు.మహానగరంలో ఎవరూ తెలీదు.మన సులో ఉందల్లా సినిమాల్లో వేషాలు వే యాలని అంతే...పక్కా సినిమా కష్టలు మొదలయ్యాయి.తిండి లేదు.వసతి లే దు.ఐనా ఏదో మూల ఆశ.అక్కడక్కడ తింటూ,లేని రోజు పస్తుంటూ,రోడ్డు ప క్కనే ఏ చెట్టుకిందనో పడుకుంటూ...రోజు లు గడుస్తుండగా,ఒక రోజు హఠాతుగా పే పర్ లో పరీక్షా ఫలితాలు చూసి ఇంటర్మీ డియట్ లో పాసయ్యానని తెలుసు కు న్నాడు.సరే ఇక్కడా ఏమీ అవకాశాలు రావడంలేదుకదా.పాసయ్యాను వెనక్కి వెళ్ళి బి.ఎ.చదువుదామని నిర్ణయించు కుని తిరిగి పెద్దాపురం వెళ్ళిపోయాడు. దాసరి గారి పరిచయం వలన కృష్ణ సిని మా నేరము-శిక్ష ఈయనకు ఒక చిన్న పా త్రలో నటించే అవకాశం వచ్చింది.ఒక పా ట చిత్రీకరణలో 170 మంది జూనియర్ ఆర్టిస్టులలో ఈయనా ఒకడు.చిన్నవేషం తో నిరుత్సాహపడ్డాడు.కానీ, ఇంటర్మీ డియట్ పాసైన విషయం తెలిసింది.డిగ్రీ పూర్తి చేసుకొని తిరిగి రమ్మని దాసరి సలహా ఇచ్చాడు.అదీకాక,సినిమా టైటి ల్లలో ఎన్.టి.రామారావు బి.ఏ అని చూసి,తనూ బి.ఏ చేయాలనే కోరిక ఉండేది.అలా బి.ఏ చేయటానికి తూర్పు గోదావరి తిరిగివచ్చాడు.అదే సమ యంలో నేరము-శిక్ష సినిమా విడుద లైంది.వందమందిలో ఒకడిగా నిలబడి నా,తన గ్రామప్రజలు సినిమా చూసి, తన ను అందులో గుర్తిపట్టి,తను కనిపించిన సన్నివేశాలు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి, ఈలలు వేశారు. "మన రెడ్డి బాబులు సిని మాలో ఉన్నాడు" అని చెప్పేవారు.
ఈ గుర్తింపు సినిమా వంటి ప్రజామాధ్యమం యొక్క శక్తిని నారాయణమూర్తి గుర్తించే లా చేసింది.అప్పుడే డిగ్రీ పూర్తిచేసి సిని మాలలో చేరాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీ కళాశాల సాంస్కృతిక కార్యక్రమా లలో మహా చురుకుగా పాల్గొనేవాడు. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా వీరి బృందం కార్యక్రమం ఒకటి ఉండాలంతే. మరో పక్క కమ్యూనిస్ట్ పుస్తకాలు కూడా బాగా చదువుతుండేవాడు.సినిమా పిచ్చి మాత్రం లోపల తొలుస్తూనే ఉండేది.ఒక సారి కాలేజీలో అప్పటి హీరోయిన్ మం జుల నృత్య కార్యక్రమం ఏర్పాటు చేయ డంలో ఇతడు ముఖ్యపాత్ర వహించాడు. బి.ఎ పూర్తి కావడమే తరువాయి.మద్రా సు ప్రయాణం కట్టాడు.ఎప్పుడో మూడు నాలుగేళ్ళ క్రిందట వచ్చిన అనుభవమే మద్రాసుకి.ఐతే ఈ సారి బి.ఎ డిగ్రీ ఉంది కాబట్టి వేషాలు చాలా సులభంగా దొరుకు తాయి అనే భావన ఉండేది.ఏముందీ ఎవరు పడితే వాళ్ళు పిలిచి నాకు హీరో వేషం ఇస్తారు అనుకుంటూ మద్రాసులో అడుగుపెట్టాడు.పాండి బజారు చెట్లే రాత్రిపూట ఆశ్రయమిచ్చేవి.అలా కష్టాలు పడుతూనే రోజూ స్టూడియోల చుటూ తిరిగితే ఒకటి అరా జూనియర్ ఆర్టిస్టు అవకాశాలు దొరికాయి.పొలాల్లో పనిచే సేవాళ్ళల్లో ఒకడిగా,కాలేజీ సూడెంట్స్ లో ఒకడిగా,ఊరేగింపులో వెనకాలా..ఇలా అన్నీ గుంపులో గోవిందా వేషాలే.అవి కూ డా షూటింగ్ రోజు మాత్రమే తిండి పెట్టగ లిగేవి.ఆ రోజుల్లోనే దాసరి నారాయ ణరావు పరిచయం ఇతడి బ్రతుకుని ఒక మలుపు తిప్పింది.దాసరి ఇతడిలోని కళా తృష్ణని ఎలా కనిపెట్టగలిగారో కానీ పరి చయం కాగానే రమేష్ బాబు హీరోగా ఆ యన తీస్తున్న నీడ చిత్రంలో ఇతడికి ప్రా ధాన్యత - ఉన్న వేషాన్నిచ్చారు.ఆ సిని మాలో నారాయణమూర్తి కొంత ప్రాధా న్యత ఉన్న నక్సలైటు పాత్ర లభించింది. సినిమా బాగా విజయవంతమై,నారాయ ణమూర్తి మద్రాసులోని చోళ హోటల్లో కరుణానిధి చేతులపై వంద రోజుల షీల్డు అందుకున్నాడు.
ఆ తరువాత దాసరి, రా మానాయుడు,జ్యోతి శేఖరబాబు వంటి దర్శకుల ప్రోత్సాహంతో అనేక సినిమా లలో సహాయపాత్రలలో నటించాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో నారాయణమూర్తి పూర్తిస్థాయి హీరోగా సంగీత అనే సినిమా తీశాడు.ఈ చిత్రాన్ని పూర్ణా పిక్చర్స్ పతాకంపై హరగోపాల్ ని ర్మించాడు.అందులో రెండు పాటలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాడాడు.చి త్రం ఒక మోస్తరు విజయం సాధించి 50 రోజులపాటు ఆడింది.అయితే ఆ తర్వా త హీరోగా అవకాశాలు రాలేదు.చిన్నవే షాలకు కూడా తీసుకోక బాగా కష్టాలను ఎదుర్కొన్నాడు.తిండికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో నే హీరో అవ్వాలంటే మొదట దర్శకునిగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడు.
దర్శకునిగా పూర్వానుభవం లేకపోవటం వలన,ఎవరూ సినిమా తీసే అవకాశం ఇ వ్వలేదు.షూటింగులు ఉన్నప్పుడల్లా దా సరి పనితీరును గమనిస్తూ ఉండేవాడు. దర్శకునిగా తనకు తాను అవకాశమిచ్చు కోవటానికి తనే నిర్మాత అయితే కానీ కు దరదని గ్రహించి,స్నేహితులకు తన ఆశ యం తెలియజేయగా,వాళ్లు కొంతమంది నారాయణమూర్తి సినిమా నిర్మించడానికి సహాయం చేశారు.అందుకే తన బ్యాన రుకు "స్నేహ చిత్ర" అని పేరు పెట్టుకున్నా డు.భారత-రష్యా స్నేహ కరచాలనాన్ని చిహ్నంగా ఎంచుకున్నాడు. నారాయణ మూర్తి నిర్మాత,దర్శకుడిగా తన మొదటి సినిమా అర్ధరాత్రి స్వతంత్రం చిత్రీకరణను 1984,జూన్,10న రంపచోడవరంలో ప్రా రంభించాడు.ఆ సినిమా పదహారున్నర ల క్షల పెట్టుబడితో పూర్తయింది.సెన్సార్ తో వచ్చిన చిక్కులను కొంతమంది వ్యక్తుల సహకారంతో అధిగమించి సినిమాను 1986,నవంబర్,6,టి.కృష్ణ వర్ధంతి రోజున విడుదల చేశాడు.ఆ సినిమాలో నారాయ ణమూర్తి ఒక నక్సలైటు పాత్రను పోషిం చాడు.ఈ సినిమా ఊహించినంతగా విజ యవంతమై చరిత్ర సృష్టించింది.ఈ సిని మా విజయవంతమవటానికి వంగపండు ప్రసాదరావు వ్రాసిన పాటలు,పి.ఎల్.నా రాయణ సంభాషణలు,నారాయణ మూ ర్తి కథ,చిత్రానువాదము,దర్శకత్వం ఎంత గానో దోహదం చేశాయి.నారాయణ మూర్తి సినిమాలన్నీ సమకాలీన సామా జిక సమస్యలు ఇతివృత్తంగా తీసినవే. ఈయన చిత్రీకరించిన సినిమాల్లో నిరు ద్యోగం,ప్రపంచ బ్యాంకు విధానాలు,డ బ్ల్యూటీవో ఒప్పందం,తృతీయ దేశాల సమస్యలు,పర్యావరణ సమస్యలు,ఆన కట్టలు,నిర్వాసితుల సమస్యలు,భూ స మస్యలు,రాజకీయ అతలాకుతలాలు మొదలైన వాటికి అద్దంపట్టాడు.అందు వలన బాధిత ప్రజలు ఈయన సినిమాల లోని పాత్రలలో మమేకమై పోయేవారు. ఆ తరువాత వచ్చిన సినిమాలలో దం డోరా సినిమా సారా వ్యతిరేక ఉద్యమం చేపట్టడానికి మహిళలకు స్ఫూర్తినిచ్చిం ది.ఎర్రసైన్యం భూపోరాటానికి అజ్యం పో సింది.చుండూరు సంఘటనను చిత్రీకరిం చిన లాల్ సలాం పెద్ద ఎత్తున కలకలం రే పింది.ఆ సినిమా తీసినందుకు పోలీసులు నారాయణమూర్తిని విచారణ చేశారు.కొ న్నాళ్ళు ఆ సినిమాను నిషేధించారు కూ డాను.నారాయణమూర్తి సినిమాల్లో ద్వం దార్ధ సంభాషణలు,పెద్ద పెద్ద సెట్టింగులు, పేరు మోసిన నటీనటవర్గం,ప్రత్యేక హాస్య సన్నివేశాలు,యుగళగీతాలు మొదలైనవి ఉండవు.వాస్తవ సమస్యలను చిత్రీకరించి సామాన్య ప్రజల మనసులను ఆకట్టుకో వటం మీదే ఆధారపడిన సినిమాలు.తె లుగు సినిమారంగంలో ఎర్రసైన్యం సిని మా ఒక ట్రెండును సృష్టించింది.ఆ తర్వా త అనేక పెద్ద నిర్మాతలు ఇలాంటి మూస లో అనేక సినిమాలు నిర్మించి,విడుదల చేశారు.అలా మూస చిత్రాల ఉధృతి ఎ క్కువై,ఆ తర్వాత వచ్చిన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు.
నారాయ ణమూర్తి ఒక పది సంవత్సరాల పాటు తీసిన సినిమాలు చాలా విజయవంత మయ్యాయి.ఆ తరువాత ఏడు సంవత్స రాల పాటు వరుస పరాజయాలను చవి చూశాడు.ఊరు మనదిరా చిత్రం విజ యంతో తన సినిమా జీవితంలో రెండవ అంకాన్ని ప్రారంభించాడు 2009,మార్చి వరకు నారాయణమూర్తి కథానాయకు నిగా నటించిన 26 సినిమాలలో 10 సిని మాలు విజయవంతమయ్యాయి.అవి (వి డుదలైన క్రమంలో) - అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు,లాల్‌సలాం,దండోరా,ఎ ర్రసైన్యం,చీమలదండు,దళం,చీకటి సూ ర్యులు,ఊరు మనదిరా,వేగుచుక్కలు.
వ్యక్తిగత జీవితం :
నారాయణమూర్తి ఏ ఆడంబరాలు లేకుం డా సాధారణ జీవితం గడపటానికి ఇష్టప డతాడు.అవివాహితుడైన నారాయణ మూర్తిని ఎందుకు పెళ్ళిచేసుకోలేదని ప్ర శ్నిస్తే,అదంత చర్చించదగ్గ అంతర్జాతీయ సమస్యేమీకాదని దాటవేశాడు.తన జీవి త భాగస్వామి తన ప్రజా జీవితానికి ఎక్క డ అడ్డువస్తుందో అనే అనుమానంతో పె ళ్ళి చేసుకోలేదని చెప్పాడు.సినీ దర్శక, నిర్మాతగా 19 సినిమాలను తీసి,25 సిని మాలలో నటించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్పటికీ,ఈయనకు సొంత ఇళ్లు కానీ, సొం త కారు కానీ లేవు.ఈయనకు తెలుగు దేశం పార్టీ రెండుసార్లు కాకినాడ లోక్‌సభ స్థానం,కాంగ్రెస్ పార్టీ తుని అసెంబ్లీ సీటు ఇవ్వజూపినా,రాజకీయాలలో ప్రవేశించే ఉద్దేశం లేకపోవటం వలన తిరస్కరించాడు.
1) అంటరానితనం దుర్మార్గం వంటివి ఇష్టం ఉండవు.
2) బర్త్ డే లు,మదర్స్ డే లు,ఫాదర్స్ డేలు జరుపుకోవటం నచ్చవు.
3) పునర్జన్మ,స్వర్గం,నరకం,ఖర్మ సిద్ధాం తం నమ్మడు.
4) ఏడిస్తేనే నీ కష్టాలు తొలుగుతాయను కుంటే ఏడువు అన్న బుద్ధుడి సూక్తి నచ్చి ఏడుపు మానాను.
5) కారల్ మార్క్స్ అంతటి వారు కూడా దేవుడు లేడని చెప్పలేదు.నేను భారతీ యుణ్ణి.ముఖ్యంగా హిందువుని.ఆ సంప్ర దాయాల మధ్య పుట్టి పెరిగిన వాణ్ణి.చెట్ల లో,పుట్టలలో,గట్టులలో చివరకు విష సర్పాల్లో కూడా దైవాన్ని చూసే గొప్ప సం స్కృతి మనది.ఆ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాను కాబట్టే నాకు దేవుడంటే నమ్మకం.
6) సాధారణమైన జీవితం గడపడానికి కారణం నా ‘మెంటాలిటీ’. చిన్నప్పట్నుంచీ నేను ఇంతే.నా అభిరుచుల్ని,అభిప్రాయా ల్ని,మనోభావాల్ని మార్చుకోలేని అశ క్తు ణ్ణి.పదిమందీ నన్ను చూసి గొప్పగా చె ప్పుకోవాలని నేను ఇలా ఉండను.ఇలా బతకడమే నాకిష్టం.నా రూమ్‌లో చాప, దిండు మాత్రమే ఉంటాయి.వేప పుల్లతో పళ్లు తోముకుంటా.సబ్బుతో స్నానం చే యను.మొహానికి పౌడర్ రాయను.నా స్వభావం ఇది.చెట్లకింద కూర్చోడం,జనం తో మమేకమవ్వడం...ఇవే నాకు ఆనం దాన్నిచ్చేవి.ఎవరో ఏదో అనుకుంటారని నా స్వభావాన్ని మార్చుకోలేను.
7) మా గురువుగారు నన్ను ‘పీపుల్స్ స్టా ర్’ అన్నారు.‘జననాట్యమండలి గజ్జ ఆగి న చోట...ప్రజల గళాన్ని వినిపిస్తున్నాయి నారాయణమూర్తి సినిమాలు’ అన్నాడు గద్దరన్న.
8) స్వదేశీ భారతి అనే ప్రఖ్యాత బెంగాలీ రచయిత ఆయన రాసిన ‘ఆరణ్యక్’ బుక్ పై ముఖచిత్రంగా నా బొమ్మ వేశాడు.పూ రిజగన్నాథ్ తన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రాన్ని నాకు అంకితమిచ్చా డు.నాకు ఈ తృప్తి చాలు.
9) పెళ్లి విషయంలో కూడా నాకంటూ కొ న్ని కచ్చితమైన అభిప్రాయాలుండేవి.దా నికి పెద్దలు ఒప్పుకోలేదు.నేను అభిప్రా యం మార్చుకోలేదు.
10) చివరకు ఒంటరిగా మిగిలిపోయా.
దేవుడు నన్ను అన్ని విషయాల్లో కింగ్‌ని చేసి ఆ ఒక్క విషయంలో అన్యాయం చేశాడు.ఇంటికెళ్లగానే.. ఒంటరితనం క మ్మేస్తుంది.జ్వరం వచ్చినప్పుడు పలక రించే నాథుడు లేకుండా ఒంటరిగా ము డుచుకొని పడుకొని ఉంటాను.తోడు లేని నా జీవితం కూడా ఓ జీవిత మేనా.ఏ గోంగూరో,లేక చేపల పులుసో తినాలని పించినప్పుడు,అవి హోటల్లో దొరకనపు డు...అదే నాకంటూ ఓ భార్య ఉంటే వండి పెట్టేది కదా అనిపిస్తుంది.మేం సెటిల్ అ వ్వలేదు.అయ్యాక పెళ్ళి చేసుకుంటాం అ నే ధోరణి మానండి.ఏ వయసులో జరగా ల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా పెళ్ళి చేసుకోండి.
11) పేరుప్రఖ్యాతుల కోసం మాత్రమే జీవించేవాడికి మానసిక శాంతి ఉండదు.
Comments
Post a Comment