ఇన్ స్టాలో పరిచయమైన ధనవంతుడి కోసం ఏపీకి వచ్చిన జార్ఖండ్ వివాహిత...

ఇన్ స్టాలో పరిచయమైన ధనవంతుడి కోసం
ఏపీకి వచ్చిన జార్ఖండ్ వివాహిత.. 

VS9TV న్యూస్,హైదరాబాద్ :
సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయో మనం రో జూ చూస్తూనే ఉన్నాం.అనైతిక సంబంధాలు,అసాంఘిక పనులకు సోషల్ మీడియాను మాధ్యమంగా వాడుకుంటున్నారు కొందరు.తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ వి వాహితను దారి తప్పేలా చేసింది.పెళ్లై,పిల్లలున్న వివాహిత సోషల్ మీడియా మాయలో పడింది.ఏపీలో పరిచయం అయిన వ్యక్తిని నమ్మి...అతని ప్రేమలో మునిగిపోయింది.కానీ ఆ నమ్మకంలో చేసిన తప్పు...చివరకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.వివరాల్లోకి వె ళ్తే...జార్ఖండ్‌కు చెందిన 30ఏళ్ల వివాహితకు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరి చయం ఏ ర్పడింది.ఇద్దరు గంటల కొద్దీ చాటింగ్‌ లో మునిగితేలారు.ఆపై ఆడియో,వీడియో కాల్స్‌ కూడా నడిచాయి.వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.తనను ధనవంతుడిగా, అనుభ వం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మే సింది.భర్త,ముగ్గురు చిన్నారులను వదిలి...ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రా రంభించాలని ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయి ఏపీ చేరుకుంది.కృష్ణాజిల్లా మచిలీ పట్నంలో తన ఆన్ లైన్ ప్రియుడ్ని కలుసుకుంది.అయితే అక్కడే అసలు నిజం బయటప డింది.తనను ధనవంతుడు అని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తు న్నాడని తెలిసి ఆమె షాక్ గురైంది.తాను మోసపోయానని గ్రహించి తీవ్ర నిరాశకు లో నైంది...ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్,సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల జోక్యంతో మహిళను సురక్షితంగా తీసుకువచ్చారు.తల్లిదండ్రులు,బంధువులు క లిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది.ఈ ఘటనలో విశేషం ఏమిటంటే భార్య దారి తప్పినా...భర్త మంచి మనసుతో తిరిగి ఆమెను ఏలుకు నేందుకు అంగీకరించాడు.కుటుంబం కోసం,పిల్లల భవిష్యత్తు కోసం మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది.కానీ మరో వైపు చె డు సావాసాలను కూడా పరిచయం చేస్తుంది.అందుకే అప్రమత్తత అవసరం అని సైబర్ ని పుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...