మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేత నాలు,శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లిం చాలి...సిఐటియు...
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు,శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలిసిఐటియు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ప నిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు స్కూల్ శానిటేషన్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించా లని కోరుతూ శుక్రవారం కర్నూలు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.నాగభూషణంకి వినతిపత్రం సమర్పిం చారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం.విజయ రా మాంజనేయులు నగర ఉపాధ్యక్షులు కే.సుధాకరప్ప,జి.ఏసు మాట్లాడుతూ కర్నూలు జిల్లా లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో వివిధ మండల ప్రాథమిక ప్రాథమికోన్నత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వే తనాలు పెండింగ్ బిల్లులు మెగా పేరెంట్స్ సమావేశపు బిల్లులు అలాగే శానిటేషన్ వర్క ర్స్ జీతాలు పెండింగ్ లో ఉన్నాయని,దీని వల్ల తమ కుటుంబాల్లో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు.మూడు నెలలుగా బిల్లులు పెండింగ్ వేతనాలు రా కపోయినా మధ్యాహ్న భోజనం పథకానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అప్పులు తీసు కొని వచ్చి వంటలు చేయడం జరుగుతుందని మూడు నెలలకు ఒకసారి వచ్చే బిల్లులు అ ప్పులు కట్టడమే కాకుండా వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుందని వారు తెలిపారు.ప్రభు త్వం ఒకపక్క డోక్క సీతమ్మ భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం కాకుండా,అక్కడ పని చేస్తున్న వారిని సరైన పద్ధతిలో జీతాలు చెల్లించి,బిల్లులు చెల్లించి ఆదుకుంటే బాగుం టుందని వారు తెలిపారు.అలాగే శానిటేషన్ వర్కర్స్ ఉద యం ఎనిమిది గంటలకు వచ్చి సాయంకాలం నాలుగు గంటల వరకు స్కూలులో ఉండి స్కూలు మైదానము తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా విద్యార్థుల టా యిలెట్స్ బాత్రూంలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడు స్కూలు పరిసరాలను పరిశు భ్రంగా ఉంచే వారి వేతనాలు చెల్లించకుంటే వారు ఎలా కుటుంబాలను గడుపుకొని పనిచేస్తార ని వారు తెలిపారు.వెంటనే స్కూలు శానిటేషన్ వర్కర్ల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని,మ ధ్యాహ్న భోజనం పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు వేతనాలు చెల్లించాలని వారు డి మాండ్ చేశారుఅనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ ఏ.నాగభూషణం మాట్లాడుతూ ఇక్కడ అన్ని బిల్లులు తయారు చేసి ట్రెజరీకి పంపామని బిల్లులు మంజూరైన వెంటనే అకౌంట్లో జమ చేస్తామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం జిల్లా నాయ కులు కె.భారతి,లీలావతమ్మ నాగమణి,మాసుమ్,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment