కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి నీతిమాలిన చర్యమాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు...

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి నీతిమాలిన చర్య
మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బిజెపి యువ మోర్చా కార్యకర్తలు దాడి చేయడం నీతి మా లిన చర్య అని మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు ఎం.సుధాకర్ బాబు విమర్శించారు.శని వారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన వి డుదల చేస్తూ నిన్న అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ ట్రైనింగ్ లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి నా యుడు బోయ జిల్లా ఎస్పీ,స్థానిక సిఐతో మాట్లాడి పార్టీ కార్యాలయానికి రక్షణ కల్పిం చాలని కోరడం జరిగిందని అన్నారు.పోలీసులు రక్షణగా ఉన్న వారి సమక్షంలోనే బిజెపి యువమోర్చా కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయడం,గేటును డ్యామేజ్ చేసి,ఫ్లెక్సీలు చింపివేయడం,కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని కఠిన పద జా లంతో విమర్శించడం బిజెపి గుండాలకే తగునని చెప్పారు.కర్నూలు జిల్లాలో ఎప్పుడు ఎ రగని రీతిలో అధికార మదంతో మతతత్వ పార్టీ,బిజెపి పార్టీ యువ మోర్చా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడికి పునుకున్నది.దేశం,రాష్ట్రంలో ఏ పార్టీవాళ్లు ఏమి చే సుకున్నరో తెలిదుకానీ,కర్నూలు జిల్లాలో మాత్రం ఏ పార్టీ కూడా ఒక పార్టీ ఆఫీస్ పైకి మరో పార్టీ రాలేదు.దాడి చేయలేదు అది కర్నూలు సంస్కృతి అని పేర్కొన్నారు.కర్నూలు లో ఉండే రాజకీయ నాయకులందరు సామరస్యంతో ఒక్కరికి ఒక్కరు గౌరవించుకుంటూ ఉండేవారం,కానీ ఈ మతతత్వ ప్రేరేపిత పార్టీ బిజెపి వారు సరికొత్త నాటకం ఆడారు. నే డు ఇదే పునరావృతం అయితే భవిష్యత్ లో పార్టీ ఆఫీస్ లు పెట్టుకోలేరు.ఇది మోదీ అ మిత్ షాల నాయకత్వ లక్షణాలు ఇవి.హింసే వారి ధ్యేయమని,అదికారమే వారి ధ్యేయ మని,హింస ద్వారానే అధికారం చేపట్టిందని చెప్పారు.ఈనాటి ముఖ్య మంత్రి చంద్రబా బు నాయుడు అన్న మాటే ఇది.అమిత్ షా ఒక్క మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి ఇ లాంటి వ్యక్తి దేశానికి హోం మినిష్టర్.ఇటువంటి క్రిమినల్స్ రాజ్యం ఏలుతుంటే వారి క్రిం ద ఉన్నవాళ్లు ఇంత కంటే ఏమి చేస్తారని ఎద్దేవ చేశారు.కాబట్టి ఇది ప్రజా స్వామ్య వాదు లంతా ఖండించాలి అని విజ్ఞప్తి చేశారు.ఇంకో సారి ఇలాంటివి పునరావృతం కాకుండా జిల్లా ఎస్పీ ఈ విషయంలో చోరవ తీసుకొని,ఏవరైతే దాడి చేసారో అందరి దగ్గర సీసీ పు టేజులు ఉన్నాయి.వీడియో కెమెరాలు ఉన్నాయి.వాటి ద్వారా పరిశీలించి వారు ఎంతటి వారైనా సరే వెంటనే అరెస్టు చేసి,తగిన శిక్ష పడితే ఇంకోసారి ఇటువంటి దాడులకు పా ల్పడరని సుధాకర్ బాబు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు కోఆర్డినేటర్ అ నంతరత్నం మాదిగ,ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి పాషా,ఐఎన్టీ యూసీ జిల్లా అధ్యక్షులు బి.బతుకన్న,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్,ఐఎన్ టియుసి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతా ప్,డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్,మొదలగు వారు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...