ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంకురా అపెక్స్ హాస్పిటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకో వాలి..డివైఎఫ్ ఐ...

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంకురా అపెక్స్ 
హాస్పిటల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
డివైఎఫ్ ఐ

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అంకురా అపెక్స్ హాస్పిటల్ పై విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ ఐ న్యూసిటీ కమిటీ కార్యదర్శి హుస్సేన్ భాష డిమాండ్ చేశారు.ఈ మేరకు డివైఎఫ్ ఐ కర్నూలు న్యూసీటీ కమిటీ ఆధ్వర్యంలో సోమవా రం జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా న్యూసీటీ కార్య దర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ కర్నూలు నగరంలోని అంకురా అపెక్స్ హాస్పిటల్ యా జమాన్యం ప్రజల ప్రాణాలతో దందా చేస్తుందని విమర్శించారు.ఈ మధ్యకాలంలో ఒక గ ర్భిణీ మహిళ డెలివరీ కోసం అంకురా హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే,కేవలం 10రోజులకే కొన్ని లక్షల రూపాయలు బిల్లు వేసినట్లు సంఘం దృష్టికి వచ్చిందని తెలిపారు.ఒక అంకుర హాస్పిటల్ మాత్రమే కాదు కర్నూలులోని ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా అధిక బిల్లు లు,అనవసర పరీక్షలు,రోగుల నుండి అధిక మొత్తాలు వసూలు చేసే పరిస్థి తులు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.ప్రాణాలు బతికించుకోవడం కోసం హాస్పిటల్‌లో చేరిన రోగుల నుం డి డబ్బే లక్ష్యంగా వారి జేబులకు చిల్లులు పెట్టే విధానాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్,యాజమా న్యాలు పాటిస్తున్న కూడా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రని విమర్శించారు.కావున కలెక్టర్ స్పందించి అంకురా అపెక్స్ హాస్పిటల్‌ పై విచారణ చే సి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,అలాగే కర్నూలు నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యొక్క డబ్బుల దందాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.లేకపోతే భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్ర మంలో డి వై ఎఫ్ ఐ నగర నాయకులు వీరేష్,శివశంకర్,విజయ్ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...