మన ప్రాంతం – మన సమస్య...తిరుపతి పోలీసుల వినూత్న కార్యక్రమం...

మన ప్రాంతం – మన సమస్య
తిరుపతి పోలీసుల వినూత్న కార్యక్రమం
VS9TV న్యూస్,తిరుపతి :
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి రూరల్ పోలీసులు ప్రజల సమస్యల ను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు “మన ప్రాంతం – మన సమస్య” అనే వినూత్న కార్యక్రమా నికి శ్రీకారం చుట్టారు. ప్రజలతో నేరుగా మమేకమవు తూ వారి సమస్యలను తెలుసుకోవడం,వెంటనే పరి ష్కార చర్య లు చేపట్టడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.కార్యక్రమంలో భాగంగాతిరు పతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరూరు పంచాయతీ హ రిపురం కాలనీలో గ్రామసభ నిర్వహించి,స్థానిక ప్రజ లతో పోలీసులు సమావేశమయ్యారు.గ్రామ ప్ర జలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారులు స్వయంగా అడిగి తెలుసుకుని,అక్కడికక్కడే పరిష్క రించగల అంశాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.అలాగే నేటి సమాజంలో పెరుగు తున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా స్నాచింగ్ ఘటనలు,మహిళల భద్రత, ఈవ్ టీజింగ్,పోక్సో చట్టం (POCSO Act) కింద బాలలపై జరిగే నేరాలకు విధించే కఠిన శిక్ష ల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు.
మహిళలు,బాలికలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తు లు లేదా సంఘటనలు గమ నించిన వెంటనే పోలీసు లకు సమాచారం అందించాలని పోలీసులు సూచిం చారు.ఈ విధంగా పోలీస్–ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంపొందిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపా డేందుకు తిరుపతి జిల్లా పోలీసులు కట్టుబడి పనిచే స్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు వారి సిబ్బంది పాల్గొన్నారు.

Comments