​అంబులెన్సులో బ్రెయిన్-డెడ్ మహిళ.. ‘భారీ కుదుపుతో తిరిగివచ్చిన ప్రాణం...

​అంబులెన్సులో బ్రెయిన్-డెడ్ మహిళ.. ‘భారీ కుదుపుతో తిరిగివచ్చిన ప్రాణం
VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఒక ఆశ్చ ర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.బ్రెయి న్-డె డ్ అయినట్లు భావించి,ఆశలు వదులుకుని ఇం టికి తీసుకెళ్తున్న ఒక మహిళ,అంబులెన్స్ ప్రయా ణంలో తగిలిన ఒక భారీ కుదుపు వల్ల తిరిగి స్పృ హలోకి వచ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి... పిలిభిత్ జిల్లాకు చెందిన బింజా కున్వర్. ఆమె స్థానిక జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.ఫిబ్రవరి,22న ఇంట్లో పని చేసు కుంటుండగా ఆమె అకస్మాత్తుగా కింద పడిపో యారు.మెరుగైన చికిత్స కోసం బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించిన ప్పటికీ,ఆమె కోలుకునే అవకాశాలు లేవని,బ్రె యిన్-డెడ్ అయిందని వైద్యులు తెలిపారు.దీం తో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అయితే ఫిబ్రవరి, 24న అంబులెన్సులో ఇంటికి తీసుకెళ్తుండగా, బరేలీ-హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక భారీ గుంత కారణంగా వాహనం గట్టిగా కుదుపునకు గురైంది. ఆ వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న ఆ మె ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం ప్రారంభిం చి,కళ్లు తెరిచారు.వెంటనే ఆమెను తిరిగి ఆసుప త్రికి తరలించారు.ఆమె శరీరంలో విషపూరిత అంశాలు ఏవైనా ఉన్నాయేమో అని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు.దాదాపు 12 రో జుల చికిత్స తర్వాత ఆమె ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.

Comments