పెళ్లి పేరుతో వల...రూ.1.5కోట్ల కట్నం డీల్... చివరికి కటకటాల్లోకి...

పెళ్లి పేరుతో వల...రూ.1.5కోట్ల కట్నం డీల్... చివరికి కటకటాల్లోకి
VS9TV న్యూస్,హైదరాబాద్ :
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై,తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుం బాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాల య్యాడు.పెళ్లి పేరుతో రూ.1.5కోట్ల కట్నం డిమాండ్ చేసి,నిశ్చితార్థం కూడా చేసుకున్న ఈ కేటుగాడి బం డారం ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో జరిగిన వేధింపు ల తో బయటపడింది.ఈ ఘటన హైదరాబాద్‌లో వెలు గుచూసింది.వివరాలు ఇలా ఉన్నాయి...హైదరాబాద్‌ కు చెందిన పనస మధు (30) ప్రముఖ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ వివరాలతో ప్రొఫైల్ సృష్టించాడు.తాను ఫుడ్ కార్పొరే షన్ ఆఫ్ ఇండియా (FCI)లో గ్రేడ్-3 టె క్నికల్ మేనేజర్‌గా చర్లపల్లిలో పనిచేస్తున్నట్లు పేర్కొ న్నాడు.ఈ క్రమంలో నల్గొండకు చెందిన ఓ యువతి ప్రొఫైల్ చూసి ఆమెను సంప్రదించాడు.మాటలతో న మ్మించి,ఆమె కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రస్తావన తె చ్చాడు.తన ఉద్యోగాన్ని నిరూపించేందుకు నకిలీ ఐడీ కార్డు కూడా చూపించడంతో వారు నిజమని నమ్మా రు.యువతి కుటుంబం ఆర్థికంగా స్థితిమంతులని గ్రహించిన మధు,తొలుత రూ.2 కోట్ల కట్నం డిమాండ్ చేశాడు.చివరకు ఇరు కుటుంబాల మధ్య చర్చల అ నంతరం కోటిన్నరకు ఒప్పందం కుదిరి నిశ్చితార్థం కూ డా జరిగింది.అయితే,ఇటీవల ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరు తో యువతిని హైదరాబాద్‌లోని చైతన్యపురిలో ఉన్న ఓ గదికి పిలిపించిన మధు,ఆమెను అనుమానిస్తూ తీవ్రంగా వేధించాడు.అతని ప్రవర్తనతో భయపడిన యువతి,ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తె లియజేసింది.దీంతో అనుమానం వచ్చిన వారు మ ధు ఉద్యోగం గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.అతను FCI ఉద్యోగి కాదని తేలడం తో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు న మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మధును ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...