ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)డిమాండ్...

ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షంచాలి
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)డిమాండ్
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
చిత్తూరు జిల్లా,వి.కోట,ఆంధ్రజ్యోతి విలేఖరి జగ న్మో హన్ రెడ్డి దారుణ హత్యను యునైటెడ్ జర్నలిస్ట్ ఫో రం (యుజెఎఫ్)తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు మంగళవారం ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షం చాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) వ్యవ స్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,సభ్యులు యూసుఫ్ ఖాన్ రాజశేఖర్,జి.విజయ్ కుమార్,నాగేం ద్ర,కిషోర్, వై.వి.రెడ్డి,వి.విజయ్ కుమార్,మెట్రోమధు,ప్ర సాద్ లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.అ దేవిదంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహాకారం అందించాలని కోరారు. సుప్రీం కోర్టు,హైకోర్టులు జర్నలిస్ట్ లపై దాడులను ఖం డిస్తూ ఆదేశాలు జారీ చేసిన కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.భ విష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా ప్రభుత్వం జర్నలిస్ట్ రక్షణ చట్టం అమ లు చేయాలనీ వారు డిమాండ్ చేశారు.

Comments