అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అరెస్ట్?ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా...ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్...
అనంతపురం హనీ ట్రాప్ కేసులో వైసీపీ నేత అ రెస్ట్?
ధనవంతులను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా
ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్
అనంతపురంలో కలకలం రేపుతున్న హనీట్రాప్ కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది.అమాయకుల ను,ధనవంతులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాలో ఒక రాజకీయ నేత పేరు బయటకు రావడం జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బున్న వారిని వల వేసి ట్రాప్ చేసి,లక్షలాది రూ పాయలు వసూలు చేస్తున్న ముఠా వెనుక వైసీపీకి చెందిన మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి కీలక సూ త్రధారిగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు,దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.నిందితులతో నరేందర్ రెడ్డి నిరంతరం టచ్ లో ఉన్నట్లు కాల్ డేటా,వాయిస్ రికార్డుల ద్వారా పో లీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.దీంతో ఆయన ను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్న ట్లు సమాచారం.ఈ కేసులో 'కింగ్' గా పిలవబడే రంగ మ్మ నాయుడు (చిన్ని నాయుడ మ్మ),రాజేశ్ తో పా టు జయలక్ష్మి,మల్లేశ్వరి,అనంత కుమారి అనే ము గ్గురు మహిళలను పోలీసులు ఇప్పటికే జైలుకు పం పారు.ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ మొ త్తం భాగోతం బట్టబయలైంది.ఈ ముఠా ఇప్పటివరకు పలువురు ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.నింది తుల నుంచి రూ.13లక్షల నగదుతో పాటు ప్రామిసరీ నోట్లు,కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ రెడ్డి పాత్రపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత,రే పు ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Post a Comment