చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్....పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం...విక్రమ్ సింహ,నాల్గవ ప ట్టణ సిఐ...

చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరిలో ఒకరి అరెస్ట్
పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ 
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,గుత్తి పెట్రోల్ బంక్ సమీపం,సాయి నాథ్ నగర్ లో ఈ నెల తొమ్మిదో తేదీన జరిగిన చోరి లో ఒక వ్యక్తి అరెస్ట్ చేసి,పల్సర్ మోటార్ సైకిల్ స్వా ధీనం చేసుకున్నట్లు నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్ల డించారు...సాయినాథ్ నగర్ కాలనిలో ఫోన్ మాట్లా డుకుంటూ ఇంటి బయట నడుస్తున్న ఒక వివాహిత మెడలో నుంచి హెల్మెట్లు,జెర్కిన్ లు ధరించి ఒక నల్ల టి మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు మగ వ్యక్తులు సదరు వివాహిత మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని హైవే వైపు వెళ్లినట్లుగా వచ్చిన ఫిర్యాదు మే రకు నాల్గవ పట్టణ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందంగా ఏర్పడి,ఎ స్సైలు,చంద్ర శేఖర్ రెడ్డి,గోపి,కా నిస్టేబుల్ ము రళి,సుబ్బారాయుడులు కలిసి ఈ కే సును చేధించినట్లు పేర్కొన్నారు.అదే రోజు సుమారు 10-00 గంటల సమయంలో సంతోష్ నగర్ లోని నాగమణి అనే వృద్ధురాలు ఇంటి బయట కూర్చుని ఉండగా హెల్మెట్ లు ధరించిన ఇద్దరు మగ వ్యక్తులు ఆమెను సమీపించి,అందులో ఒక వ్యక్తి ఆమెను ప ట్టుకొని కత్తి చూపించి బంగారు గొలుసు లాక్కొని పా రిపోతున్న సమయంలో ఆమె గట్టిగా కేకలు వేయగా, తన బంధువులు కొడుకు,మనవడు స్పందించి గట్టిగా కేకలు వేశారు.అది గమనించిన ఆ ఇద్దరు దొంగలు వారి మోటార్ సైకిల్ లో ఎక్కి హైవే వైపుగా వెళుతూ ఉండగా,అందులో నాగమణి మనవడు వారిని సమీ పించి పట్టుకోడానికి ప్రయత్నించిగా,మోటార్ సైకిల్ అ దుపు తప్పడంతో ఇద్దరు కొద్దీ దూరం వెళ్లి మోటార్ సైకిల్ నుండి కిందకి దూకి అక్కడి నుండి తలో దిక్కు పారిపోవడం జరిగిందన్నారు.సమా చారం అందుకు న్న పోలీస్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి,సంఘ టనా స్థలంలో దొరికిన మోటార్ సైకిల్,ఒక చిన్న కీ పా డ్ ఫోన్,వారి బ్యా గ్ లను స్వాదీనం చేసుకొని సదరు ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.ఈ నేపథ్యం లో కర్నూ లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణ లో ధర్యాప్తు ప్రారంభించి,టెక్నికల్ ఆధారాల సహా యంతో దొంగలు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని,షాంలి జి ల్లాకి చెందిన భవారియా గాంగ్ లోని మానవ్,హరి ప్ర కాష్ లు గా గుర్తించి అందులో ఒకరైన మానవ్ ని నే డు బాలాజీ నగర్ నందు అరెస్ట్ చేసి,అతని వద్ద నుం డి దొంగలించుకున్న చైన్ లలోని రెండు గ్రాముల బం గారు గొలుసు ముక్కను సీ జ్ చేసి రిమాండ్ కి పంప డం జరిగిందని చెప్పారు.అయితే ఈ నెల ఏడవ తేదీ న వీరు ఇద్దరు కలిసి బెంగుళూరు వచ్చి,అటు నుండి అనంతపురం వచ్చి,కొవ్వూరు నగర్ లో ఏపీ 39-జెఎ స్ - 2653 అను నెంబర్ కల్గిన పల్సర్ మోటార్ సైకిల్ ను దొంగలించుకొని,కర్నూలు నందు చైన్ స్నాచింగ్ కి పాల్పడినట్టుగా తెలుస్తోందన్నారు.మరో ముద్దాయి హరి ప్రకాష్ గురించి ప్రత్యేక బృందాన్ని పంపించడం జరిగింది.వీరిపై బెంగు ళూరు,చుట్టూ పక్కల ప్రాంతా లలో 16కి పైగా కేసులు గలవు.అదే విధంగా హర్యా నా,ఢిల్లీ,ఉత్తర్ ప్రదేశ్ లలో కూడా 15కిపైగా దొంగత నం కేసులు నమోదైనట్లు సిఐ తెలిపారు.

Comments