పట్టపగలే తుపాకీ కాల్పుల కలకలం...కరీం నగర్‌లో జ్యువెలరీ షోరూమ్‌పై సినీ స్టైల్ దోపి డీ...

పట్టపగలే తుపాకీ కాల్పుల కలకలం
కరీంనగర్‌లో జ్యువెలరీ షోరూమ్‌పై సినీ స్టైల్ దోపిడీ
VS9TV న్యూస్,కరీంనగర్ :
కరీంనగర్ నగర నడిబొడ్డున ఆదివారం ఉ ద యం చోటుచేసుకున్న సాయుధ దోపిడీ స్థాని కంగా తీవ్ర కలకలం రేపింది.ప్రముఖ పీఎంజే జ్యువెలరీ షోరూమ్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు కాల్పులకు తెగబడి,భారీ మొత్తం లో బంగారు ఆభరణాలను దోచుకుని పరార య్యారు.జ్యువెలరీ షోరూమ్‌ లోకి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్ల ముసుగులో ప్రవేశించారు.లోపలికి వెళ్లిన వెంటనే ఆయు ధాలు బయటకు తీసి సిబ్బందిని బెదిరించా రు.అడ్డుకోవడానికి ప్రయత్నించిన సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపారు.ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు వినిపించడంతో అక్కడ ఉన్న వారు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనలో ఐదుగురు షోరూమ్ సిబ్బందికి గాయాల య్యాయి.గాయపడిన వారిని వెంట నే సమీప ఆస్పత్రులకు తరలించారు.ఇద్దరిని కరీంనగర్ అపోలో ఆస్పత్రికి తరలించగా,మరొ కరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిం చారు.దుండగులు షోరూమ్‌లో ప్రద ర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలను దోచు కుని పరారయ్యారు.జ్యోతి నగర్ గల్లీ వద్ద నుం చి పారిపోతున్న సమయంలో వారు ప్రయాణి స్తున్న బైక్ కిందపడగా,కంగారులో రెండు బులె ట్స్,ఒక మ్యాగజై న్‌ను అక్కడే వదిలివెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇవి దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారను న్నాయి.సమాచారం అందుకున్న వెంటనే పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని షో రూమ్‌ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు,ఇతర ఆధారాలను సేకరించారు.నగరంలోని సీసీ కెమెరా ఫుటేజీ లను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గా లింపు చేపట్టారు.ఈ ఘటనతో కరీంనగర్‌లో హై అలర్ట్ ప్రకటించారు.నగరం నుంచి బయ లుదేరే అన్ని మార్గాల్లో పోలీసులు తనిఖీలు చే పడుతున్నారు.సరిహద్దు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు.దుండగులు అంత ర్రాష్ట్ర ముఠాకు చెందిన వారా? లేదా స్థానికు లా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

Comments