ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి... పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్...

ఈ నెల 22వ తేదీన డిప్యూటీ సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలి

పి.రంజిత్ బాషా,జిల్లా కలెక్టర్

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 22వ తేదీన జిల్లాకు రానున్నారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేసి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.ఈ మేరకు గురువారం డిప్యూటీ సీఎం ఓర్వకల్లు మండలం పూడి చెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు పొలంలో ఫార్మ్ పాండ్ కు భూమి పూజ చేసి,తదుపరి బహిరంగ సభలో పాల్గొననున్న సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు,భద్రత గురించి ఎస్పీ తో చర్చించారు. సుమారు నాలుగు వేల మంది వరకు బహిరంగ సభకు హాజరవుతారని,అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.స్టేజ్ అరేంజ్మెంట్స్,బ్యారికేడింగ్ తదితర ఏర్పాట్లకు సంబంధించి ఆర్ అండ్ బి ఎస్ ఈకి పలు సూచనలు ఇచ్చారు.వేదికపై చేయవలసిన ఏర్పాట్లను చూసుకోవాలని జడ్పీ సీఈఓను ఆదేశించారు.పారిశుధ్య చర్యలు,శిలా ఫలకం ఏర్పాటు,బ్యాక్ డ్రాప్,తాగునీటి సరఫరా,విద్యుత్ సరఫరా,సౌండ్ సిస్టమ్,ఎల్ ఈడిలు, తదితర ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ప్రోటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయాలని, శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లు పూర్తి కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.అనంతరం కలెక్టర్,ఎస్పీ ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ను సందర్శించి తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి,జడ్పి సిఇఓ నాసర రెడ్డి,ఎస్ ఇ పిఆర్ రామచంద్రారెడ్డి,ఎస్ ఇ ఆర్ & బి మహేశ్వర్ రెడ్డి,ఎస్ ఇఆర్ డబ్లుఎస్ నాగేశ్వరరావు,ఎస్ ఇ ట్రాన్స్ కో ఉమాపతి,డిస్టిక్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ శాంతకుమారి,ఆర్ టిసి ఆర్ఎం శ్రీనివాసులు,కర్నూలు ఆర్ డిఓ సందీప్ కుమార్,డ్వామా పిడి వెంకట రమణయ్య,మెప్మా పిడి నాగ శివలీల,డి ఐపిఆర్ ఓ జయమ్మ,కర్నూలు డి ఎస్.పి.బాబుప్రసాద్,డి.ఎమ్.సివిల్ సప్లైస్ నాగసుధ,డిఎస్ ఓ రాజా రఘువీర్,డిప్యూటీ డిఏం హెచ్ఓ భాస్కర్,డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ అవినాష్ జయసింహ,డిపిఓ భాస్కర్,ఎక్జిక్యూటివ్ ఇంజనీర్లు మద్దన్న,సురేష్,ఓర్వకల్లు తహసీల్దార్ విద్యాసాగర్,ఎంపిడిఓ తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...