సుప్రీంకు చేరిన కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్...
సుప్రీంకు చేరిన కల్తీ నెయ్యిపై సిట్ రిపోర్ట్
VS9TV న్యూస్,తిరుపతి :
తిరుమల శ్రీవారి ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కల్తీపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తమ ప్రాథమిక నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. రెండు రోజుల కిందట సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణలో కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.సుప్రీంకోర్టు సిట్ నియమించిన తర్వాత పూర్తి స్థా యిలో దర్యాప్తు చేసి పాత్రధారులను గుర్తించారు.అరెస్టు చేశారు.వారుసరఫరా చేసింది అసలు నెయ్యే కాదని,కెమికల్స్ తో తయారు చేసిన పామాయిల్ లాంటి పదార్థమని గు ర్తించారు.నిందితుల రిమాండ్ రిపోర్టులో కొన్ని విషయాలను పొందు పరిచారు.అసలు చాలా విషయాలను సుప్రీంకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో వెల్లడించి ఉంటారని భావిస్తున్నా రు.సూత్రధారులు తెర వెనుక ఉండి పాత్రధారులతో ఆడిస్తున్న నాటకాలు,కోర్టుల్లో వేస్తు న్న పిటిషన్ల అంశంపైనా సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించే అవకాశా లు ఉన్నాయి.ఇటీవల తనకు ఓ పోలీసు అధికారి నోటీసులు జారీ చేశారని,ఆయన సిట్ లో భాగం కాదని వైవీ సుబ్బారెడ్డి కోర్టుకెళ్లారు.కోర్టు కూడా వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చిన నోటీ సుల్ని అదే కారణంతో రద్దు చేసింది.ఇలా దర్యాప్తును ఆటంకం కలిగించేలా వ్యవహరిం చడంతో పాటు పలురకాల పిటిషన్లు వేయడం...ఇప్పటికే అరెస్టు చేసిన వారిని బెదిరిం చడం,నిందితులుగా ఉన్న వారితో కుట్రలు చేయడం వంటివి చేస్తున్నారని సిట్ గుర్తిం చింది.కల్తీ నెయ్యి చాలా పెద్ద మాఫియా అని,సిట్ గుర్తించినట్లుగా చెబుతున్నారు.అందు కే సుప్రీంకోర్టుకు సమర్పించే నివేదిక అతి పెద్ద సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Comments
Post a Comment