ముజఫర్ నగర్ రమా ఐక్య సంఘం ఆర్ పి ఎస్.షబీరాభానును కొనసాగించాలి... సిపిఎం...

ముజఫర్ నగర్ రమా ఐక్య సంఘం ఆర్ పిగా
ఎస్.షబీరాభానును కొనసాగించాలి...సిపిఎం డిమాండ్

VS9TV న్యూస్,కల్లూరు :

కల్లూరు అర్బన్,ముజఫర్ నగర్ రమా ఐక్య సంఘంలో గత రెండున్నర సంవత్సరాలుగా ఆర్.పిగా పనిచేస్తున్న ఎస్.షబీరాభానును కొనసాగించాలని సిపిఎం నగర కార్యదర్శి టి. రాముడు సిఐటియు నగర కార్యదర్శి సి.హెచ్.సాయిబాబా,ఉపాధ్యక్షులు కె.సుధాకరప్ప, ఆర్.పిల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.ఉమాదేవి నగర అధ్యక్షులు పి.రుద్రమ్మ,రమా ఐక్య సంఘం అధ్యక్ష,కార్యదర్శులు ఎస్. శారదమ్మ,కె.సువార్తలు మెప్మా ఐబి మురళిని కలిసి గురువారం వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సిహెచ్ సాయిబాబా,టి.రాముడు మాట్లాడుతూ రమా ఐక్య సంఘంలో పొదుపు సంఘాల సభ్యులు కట్టిన డబ్బులను తన సొంతానికి వాడుకోవడం వల్ల పాత ఆర్పీని తొలగించి తీర్మానం చేయడం జరిగిందని అ న్నారు.2023,జనవరిలో రమా ఐక్య సంఘం కొత్త ఆర్పీగా ఎస్ షబీరాబానును నియ మిస్తూ ఐక్య సంఘం తీర్మానం చేయడం జరిగిందని,అప్పటి నుండి గత రెండున్నర సం వత్సరాలుగా ఎటువంటి జీతం లేకుండా ఆర్పీగా పనిచేస్తుందని తెలిపారు.ఐక్య సంఘం తీర్మాణం ప్రకారం ఆర్ పిగా ఆన్ లైన్ లో ఎక్కించమని ప్రాజెక్టు డైరెక్టర్ సీఎం ఎం సీఈఓ, జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.కానీ రెండున్నర సంవత్సరాలు గా ఆన్లైన్ ఓపెన్ కాలేదు. ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే ఆర్పీగా ఆన్లైన్లో ఎక్కిస్తామని అధి కారులు మభ్యపెడుతూ వస్తున్నారని,ప్రస్తుతం ఆన్లైన్ ఓపెన్ అయిందని చెప్పారు.పాత ఆ ర్పి పేరు ఆన్లైన్లో వస్తుందని,అవినీతికి పాల్పడిన పాత అర్పిని ఎందుకు తొలగించకుండా ఉన్నారని వారు ప్రశ్నించారు.గత రెండున్నర సంవత్సరాలుగా ఎస్.షబీరాబాను ఎటువం టి జీతం లేకుండా ఆర్పీగా పని చేస్తుందని,అటువంటి ఆమెను ఆన్లైన్లో ఎక్కించకుండా అ ధికారుల నిర్లక్ష్యం చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు.ఈ విషయాన్ని విజయవాడలో మెప్మా ప్రధాన కార్యాలయం ఎండి డైరెక్టర్ ఆది నారాయణని కలిసి వినతిపత్రం సమర్పిం చడం జరిగిందని పేర్కొన్నారు. డైరెక్టర్ ఆది నారాయణ ప్రాజెక్టు డైరెక్టర్ కి పాత ఆర్పిని తొలగించమని ఆదేశాలు ఇచ్చిన కూడా ఇంతవరకు తొలగించకపోవడం అధికారుల నిర్ల క్ష్యమని వారు తెలిపారు.ఇప్పటికైనా పాత ఆర్పిని తొలగించి 2023లో చేసిన ఐక్య సం ఘం తీర్మానం ప్రకారం ఆర్పీగా షబీరాభానును ఆన్లైన్లో నమోదు చేయాలని,లేనిపక్షంలో పొదుపు మహిళలను సమీకరించి ఆందోళన చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...