కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం...32బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం...కోట్లలో ఆస్తి నష్టం...

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం
32బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం
కోట్లలో ఆస్తి నష్టం

VS9TV న్యూస్,హైదరాబాద్ :
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమా దం సంభవించింది.ఈ దుర్ఘటనలో దాదాపు 32బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడి దయ్యాయి.వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.గత రాత్రి 11-00 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి.సమీపంలో జరగనున్న సమ్మక్క,సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు.ఒక్కో దుకాణంలో రూ.8లక్షల నుంచి రూ.10లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.ప్ర మాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దు కాణాలు పూర్తిగా కాలిపోయాయి.తమ కళ్లెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపించారు.వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలు ముకున్నాయి.మల్యాల,ధర్మపురి సీఐలు రవి,రాంనర్సింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలిం చి వివరాలు సేకరించారు.విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథ మికంగా నిర్ధారించారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...