ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్...
ఫిల్మ్‌నగర్‌లో నకిలీ IPS అధికారి అరెస్ట్
హైదరాబాద్,ఫిల్మ్‌నగర్‌లో నకిలీ ఐపీఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాలు ఇలా ఉన్నాయి...శశి కాంత్ అనే వ్యక్తి ఐపీఎస్,ఐఏఎస్ అధికారి అంటూ గత కొంతకా లంగా బిల్డర్లు,వ్యాపారులను మోసం చేస్తున్నట్టు విచారణలో బయటపడింది.పోలీసుల స మాచారం ప్రకారం...శశికాంత్ ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకొని నిజమైన అధికారిలా వ్యవహరిస్తూ బిల్డర్లను బెదిరించినట్లు తెలుస్తోంది.స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ప లు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉ న్నాయి.బిల్డర్లు ఇచ్చిన ఫిర్యాదులు,సేకరించిన ఆధారాల మేరకు పోలీసులు శశికాంత్ ను ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా,గన్‌మెన్లను ఉ పయోగించి బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.నిందితుడిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Post a Comment