ఏప్రిల్‌లో పెళ్లిల్లే...పెళ్లిళ్లు...ముహూర్తాలు కుదరడం చాలా అరుదు...

ఏప్రిల్‌లో పెళ్లిల్లే...పెళ్లిళ్లు...

ముహూర్తాలు కుదరడం చాలా అరుదు...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే సాధారణంగా ఒక నెలలో రెండు,మూడు,మాక్సిమం ఐదు ముహూర్తాలు ఉంటాయి.కాని ఈ ఏప్రిల్ నెలలో వచ్చినన్ని ముహూర్తాలు గతంలో ఎప్పుడూ వచ్చి ఉండవు.ఆ పెళ్లి ముహూర్తాల తేదీలు,సమయాలు, పండితుల సలహాలు తెలుసుకుందాం...ఎవరింట్లో అయినా శుభకార్యం చేయాలంటే ముహూర్తం చూడటం మన సంప్రదాయం.ముఖ్యంగా పెళ్లిళ్లకు కచ్చితంగా శుభ ముహూర్తం చూస్తారు.కొంతమంది ముహూర్తం కుదరలేదని నెలల తరబడి పెళ్లిళ్లు వాయిదాలు కూడా వేస్తారు.ముహూర్తాలకు అంత ప్రత్యేకత ఉంది. మరి ఏప్రిల్,2025లో పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్నాయి.
హోళీ వేడుకల సందర్భంగా కొన్ని రోజుల వరకు ముహూర్తాలు ఉండవు.ముఖ్యంగా పెళ్లిళ్లు చేయడానికి ఈ సమయం మంచిది కాదు.ఎందుకంటే ప్రస్తుతం మూఢం నడుస్తోంది.ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదు.ఈ మూఢం అయిపోయే నాటికి ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది.

ఏప్రిల్ లో పెళ్లి ముహూర్తాలు :

ఏప్రిల్ నెల మొత్తం మీద తొమ్మిది పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.ఇంత ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు చాలా అరుదుగా వస్తుంటాయి.సాధారణంగా పెళ్లి ముహూర్తం కుదరాలంటే చాలా అంశాలను పరిగణించాల్సి ఉంటుంది.జాతకాలు, గ్రహస్థితులు,గోచారాలు,తారాబలం, వధూవరుల గణన,రాశి ఫలాల పొంతన,ఇలా ఎన్నో అంశాలు కలిస్తేనే ఒక మంచి పెళ్లి ముహూర్తం సెట్ అవుతుంది.ప్రతి ఇంటిలో పెళ్లి వేడుక చేయాలనుకుంటే ఏప్రిల్ నెలలో కచ్చితంగా మంచి ముహూర్తం కుదురుతుంది.ఈ ముహూర్తాల్లో ఏదో ఒకటి కచ్చితంగా సెట్ అవుతుంది.ఏప్రిల్ నెలలో 13వ తేదీ వరకు మూఢం ఉంది.దీంతో పాటు సూర్యుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.అందువల్ల 13వరకు పెళ్లి ముహూర్తాలు లేవు.అంటే ఏప్రిల్ నెలలో సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు.నెల సగం అయిన తర్వాత నుంచి వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యాయి.అంటే కేవలం 16రోజుల్లో తొమ్మిది ముహూర్తాలు నెలకొన్నాయి.

పెళ్లి ముహూర్తాలు ఉన్న తేదీలు :

మార్చి,30న ఉగాది కావున అప్పటి నుంచి కొత్త సంవత్సరమైన విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాసం,బహూళ పక్షం పాడ్యమి తిధి నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి...వాటిలో...
ఏప్రిల్ 14(పాడ్యమి),ఏప్రిల్ 16(తదియ), ఏప్రిల్ 18(పంచమి),ఏప్రిల్ 19(షష్టి), ఏప్రిల్ 20(సప్తమి,అష్టమి),ఏప్రిల్ 21(అష్టమి,నవమి),ఏప్రిల్ 25(ద్వాదశి), ఏప్రిల్ 29(శుక్ల,విదియ),ఏప్రిల్ 30(శుక్ల తదియ).ఈ తేదీల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి.తమ తమ జాతకరీత్యా ఈ తిథుల్లో ఏ నక్షత్రానికి మంచి ముహూర్తం సెట్ అవుతుందో దగ్గర్లో ఉన్న ఆలయంలో పండితులను అడిగి ముహూర్తంను ఉపయోగించుకోవచ్చు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...