కర్నూలు వీ-లెర్న్ స్ఫూర్తితో రాష్ట్రమంతటా విస్తరిస్తాం...జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో విద్యామంత్రి నారాలోకేష్...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

కర్నూలు జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వీ-లర్న్ వర్చువల్ స్టూడియోను రాష్ట్రమంతా అన్ని జిల్లాల్లో అమలు చేయడానికి విద్యాశాఖా మంత్రి నారాలోకేష్ అంగీకరించారు.మంగళ,బుధవారాల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కర్నూలులో ప్రారంభించిన వర్చువల్ స్టూడియో గూర్చి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, సీఎం నారా చంద్రబాబునాయుడు,రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. సాంకేతికతను అందిపుచ్చుకొని జిల్లా అంతట ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు విద్యా విషయ నైపుణ్యాలను వర్చువల్ స్టూడియో నుంచి ప్రతి పాఠశాలకు అనుసంధానం చేసి బోధించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి విద్యార్థికి ప్రతి సబ్జెక్టులో ఎటువంటి సందేహాలు లేకుండా విషయనిపుణులతో వర్చువల్ స్టూడియోలో బోధించడం ద్వారా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయని జిల్లా కలెక్టర్ వివరించారు.ముఖ్యంగా వీ-లర్న్ ద్వారా టీచర్ల కొరత సమస్యను అధిగమించామని వివరించారు.జిల్లాలో దాదాపు మూడువేల మంది ఉపాధ్యాయుల కొరతను దృష్టిలో పెట్టుకొని ఈ స్టూడియో ద్వారా పాఠ్యాంశాలు చెప్పగలిగించామని అన్నారు.దాదాపు హిందీ సబ్జెక్టులోనే 500 మంది ఉపాధ్యాయుల కొరత జిల్లాలో ఉందని,దీన్ని అధిగమించడానికి పదో తరగతి దృష్టిలో పెట్టుకొని వీ-లెర్న్ స్టూడియో ద్వారా పాఠ్యాంశాలు చెప్పగలిగించామని వివరించారు.కర్నూలు జిల్లా విద్యాశాఖ రూపొందించిన వర్చువల్ స్టూడియో వీ - లర్న్ మాడ్యూల్ ను కాన్ఫరెన్స్ లో అందించారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని జిల్లా విద్యాధికారి యస్.శ్యామ్యూల్ పాల్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యాబోధన జరిగేలా చేసిన ప్రయత్నాన్ని కాన్ఫరెన్స్ లో వివరించడంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రమంతా అన్ని జిల్లాలకు విస్తరిస్తామని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రశంశించారు.అలాగే "మనబడి- కర్నూలు" యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందులో అన్ని వీడియోలు అప్లోడ్ చేసి విస్తృతంగా విద్యా విషయాలను ప్రచారం చేస్తున్న వైనాన్ని జిల్లా కలెక్టర్ వివరించారు.వీ-లర్న్ స్టూడియో ద్వారా భవిష్యత్తులో ఎటువంటి విద్యాప్రయోజత కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయాలపై మాడ్యూల్లో సంక్షిప్తంగా పొందుపరిచి వివరించడం పట్ల మంత్రి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...