కర్నూలు జిల్లా మహిళా మార్ట్ వ్యవహారంపై రెండు నెలలు సమయం కోరిన ఎం.డి ఎన్.తేజ్ భరత్...

ఏపీ మెప్మా ఆర్ పి ఉద్యోగుల సమస్యలపై సానుకూల స్పందన...

కె.ధనలక్ష్మి,ఏపీ మెప్మా ఆర్ పి ఉద్యోగుల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :

ఏపీ మెప్మా ఆర్ పి ఉద్యోగుల సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో ఈ నెల 24న,విజయవాడ,అలంకార్ ధర్నా చౌక్ లో మెప్మా ఆర్ పిల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో మెప్మా ఎండి ఎన్ తేజ్ భరత్ ఆ సంఘం నాయకులతో చర్చలు జరిపారు.చర్చల సారాంశంను ఏపి మెప్మా ఆర్ పి యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ఒక ప్రకటనలో వెల్లడించారు.

చర్చల సారాంశం :

1. బకాయి వేతనాలు చెల్లిస్తామన్నారు.
2. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 
3. ఆగిన లాగిన్స్ ని పునరుద్ధరిస్తామన్నారు.
4. యూనిఫామ్ ఇస్తామన్నారు.
5. సెల్ ఫోన్స్ సిమ్ కార్డ్స్ ఇస్తామన్నారు.
6. ఎస్ ఎల్ ఎఫ్ ల నుండి రీఛార్జి చేయిస్తామన్నారు.ఐడి కార్డులు ఇస్తామన్నారు. 
7. ఆర్ పిలతో మున్సిపల్ టాక్స్ వసూలు చేయించడం,ప్లాస్టిక్ కవర్లను గ్లాసులని కలెక్ట్ చేయించే పని మురుగు కాలువల క్లీనింగ్ చేసే పని ఆర్ పిలది కాదని,అలా పనిచేయిస్తున్న తెనాలి మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి అలాంటి పనులు ఆర్ పిలతో చేయించకుండా చూస్తామన్నారు.
8.కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామన్నారు.వేతనం డైరెక్ట్ గా ఆర్ పి ఎకౌంటుకే వేస్తామని హామీ ఇచ్చారు.
9. ఎస్ఎల్ఎఫ్ నుంచి ఇవ్వాల్సిన రూ.2000 ఆర్ పికి అందేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
10. ఆర్.పిలకు ఆదాయం పెరగటానికి వీలుగా మీసేవ పనులను అప్పగిస్తామని, దాని ద్వారా వచ్చే సర్వీసు చార్జెస్ ఆర్ పి లకి అందుతాయని,తద్వారా ఆదాయాన్ని పెంపు చేసుకోవటానికి అవకాశం కల్పిస్తామన్నారు.
11. 2025--రాబోయే కాలంలో ఇప్పుడు పనిచేస్తున్న దాని కంటే అదనపు పనులు ఉంటాయని,తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. 
12. మెప్మా ఆఫీసు నుండి చెప్పిన పనులు మాత్రమే చేయాలని చెప్పారు. 
13. యూనియన్ ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ప్రధానమైన డిమాండ్స్ అయిన వేతనాల పెంపు,గ్రేడింగ్ విధానం రద్దు,ఉద్యోగ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీ రాలేదు.
14. కర్నూలు జిల్లా మహిళా మార్ట్ తన దృష్టిలో లేదు.రెండునెలలు సమయం తీసుకుని,విచారణ చేపట్టి మహిళలకు న్యాయం చేస్తాం.
15. వేతనాల పెంపు,గ్రేడింగ్ విధానం రద్దు,ఉద్యోగ భద్రత కోసం భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం కావాలని యూనియన్ రాష్ట్ర కమిటీ ఆర్ పిలకు వారు పిలుపునిచ్చారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...