సమాజిక సేవకురాలు జె.చంద్రకళ బాయికి డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ ప్రధానం...

సమాజిక సేవకురాలు జె.చంద్రకళ బాయికి డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ ప్రధానం...

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

బీసీ మహిళ,సమాజిక సేవకురాలు జె.చంద్రకళ బాయికి అరుదైన గౌరవం దక్కింది.జె.చంద్రకళ బాయి సేవలు గుర్తించిన జర్మనీ,అంతర్జాతీయ గ్లోబల్ పీస్ యూనివర్శిటీ ఆమెకు డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ ప్రధానం చేసింది.ఈ మేరకు అంతర్జాతీయ గ్లోబల్ పీస్ యూనివర్శిటీ, జర్మనీ" ఆధ్వర్యంలో పుదుచ్చేరి (పాండిచ్చేరి)లో జరిగిన సెమినార్ సందర్భంగా "గౌరవ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్" ను ఆమెకు ప్రదానం చేసి సత్కరించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.బీసీ మహిళగా గత 25 సంవత్సరాలుగా నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తూ,మహిళలు,అభాగ్యులకు అండగా నిలిచి,ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వారికి సహాయం చేస్తూ సమాజ సేవను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.సమాజ సేవలో నిబద్ధతతో వివిధ ప్రజా సంఘాల్లో కీలక పదవులు నిర్వహిస్తున్నాను అని అన్నారు. హ్యూమన్ రైట్స్ ఫోరం,బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తూ సమాజంలో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు చెప్పారు.ఈ ప్రయాణంలో తన సేవలు గుర్తించడం, ఇందులో భాగంగా డాక్టరేట్ తో గౌరవించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ అవార్డు తన విజయంగా కాకుండా,సమాజ సేవకు అంకితమైన ప్రతిఒక్కరి విజయంగా భావిస్తున్నానని అన్నారు.ఈ గౌరవంతో నా బాధ్యత మరింత పెరిగిందని,భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా సేవ చేయడానికి నన్ను మరింత ప్రేరేపిస్తుందని తెలుపుతూ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు పాల్గొని అందరూ అభాగ్యులకు,నిరుపేదలకు అండగా నిలవడానికి ఈ పురస్కారం నా బాధ్యతను పెంచిందని,గౌరవాన్ని అందుకోవడానికి తనపై విశ్వాసం ఉంచి ప్రోత్సహించిన కర్నూలు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు,నాయకులకు, సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్రికేయులకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...