మా ఇంట్లో ఏసీ ఉండదు...రూ.50 వేల కోట్లు...అరట్టై శ్రీధర్‌ వేంబు...

మా ఇంట్లో ఏసీ ఉండదు...సంపద రూ.50 వేల కోట్లు
అరట్టై శ్రీధర్‌ వేంబు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
గూగుల్,మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌...నిత్యం ఈ టెక్‌ దిగ్గజాలతో పోటీపడుతుంటారు శ్రీధర్‌ వేంబు.తాజాగా ‘అరట్టై’తో వాట్సాప్‌కీ సవాలు విసిరి...‘మెటా’తోనూ ఢీ అంటే ఢీ అం టున్నారు.ఆయన సంపద కూడా ఆ స్థాయిలోనే ఉంది...రూ.50వేల కోట్లు మరి! ఈ వి జయాలన్నింటినీ తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూరిలో ఉంటూనే సాధిస్తున్నా రాయన.మన దేశంలో సరికొత్త ఐటీ విప్లవానికి నాంది పలికిన శ్రీధర్‌ వేంబుతో చేసిన అ రట్టై(పిచ్చా పాటి)లోని కొన్ని విశేషాలు...
పల్లెలంటే ప్రాణం :
మా నాన్నావాళ్లది తంజావూరులోని ఒళిగచ్చేరి అనే కుగ్రామం.కావేరి ఉపనది కొల్లిడం ప్ర వహించే పల్లెకాబట్టి...పచ్చదనంతో నిండి ఉండేది.నాకు ఎప్పుడు సెలవులొచ్చినా ఈ ఊరి కి వచ్చేసేవాణ్ణి.సెలవులు అయిపోయాక తిరిగి వెనక్కి వెళ్ళనని మొండికేసేవాణ్ణి.ఏడ్చి గీపె డుతున్న నన్ను బలవంతంగా తీసుకొచ్చి బస్సెక్కించేవారు.ఆ ఊరి గుర్తుగా ఏ రాయో ర ప్పో తెచ్చుకుని...దాచుకునేవాణ్ణి.ఆ ఊరిపైన నాకున్న మమకారమే జోహో కంపెనీని గ్రా మీణ ప్రాంతాలకి తెచ్చేలా చేసింది.
మూడున్నరవేల రూపాయలతో :
మా నాన్న సాంబమూర్తి వేంబు మద్రాసు హైకోర్టులో స్టెనోగా చేసేవారు.అప్పట్లో ఆయన జీతం రూ.3500.ఆ అత్తెసరు ఆదాయంతోనే మా అమ్మ కన్మణి మమ్మల్నందర్నీ పెంచిం ది.నేను చిన్నప్పటి నుంచీ స్కాలర్‌షిప్‌లతోనే చదువుకు న్నాను.చిన్నప్పుడు అమ్మ నేర్పిన పొదుపు,నిరాడంబర జీవనం నా జీవిత విధానంగా మారిపోయాయి.
ఓనమాలు దిద్దాను :
ఐఐటీ-మద్రాసులో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాక...అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సి టీలో పీహెచ్‌డీ ముగించాను.ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగం వ చ్చింది.మంచి జీతం...బంగ్లా కూడా ఇచ్చారు.అక్కడితో మా కుటుంబ కష్టాలన్నీ తీరిపో యేవే కానీ...నాకు అధ్యాపకవృత్తి సరిపోదనిపించింది.బయటకొచ్చేశాను.నాకే మాత్రం అర్థంకాని సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాల్లో ఓనమాలు నేర్చుకున్నాను.క్వాల్‌కమ్‌ సంస్థలో ఉద్యోగిన య్యాను.చిన్నకంపెనీల అవసరాలని తీర్చే సాఫ్ట్‌వేర్‌లని అందించాలని...‘అడ్వెంట్‌ నెట్‌ కం పెనీ’ని ప్రారంభించాను. 
పేరులో ఏముంది..? :
మా సంస్థ లక్ష్యం చిన్న కంపెనీలే కాబట్టి ‘అడ్వెంట్‌ నెట్‌’ అన్న పేరుని...స్మాల్‌ ఆఫీస్‌ హో మ్‌ ఆఫీస్‌(సోహో) అని మార్చు కున్నాం.విభిన్నంగా ఉండాలని ‘ఎస్‌’ని కాస్తా జెడ్‌గా మా ర్చి ‘జోహో’గా చేశాం.
వాడి కోసం...:
మా అబ్బాయి పేరు సిద్ధు.వాడికి రెండేళ్లు ఉన్నప్పుడు ఆటిజం ఉందని తెలిసింది.దాంతో నే నూ నా భార్య ప్రమీల తీవ్ర మానసిక క్షోభని అనుభవించాం.చిన్నప్పుడు నేను చూసిన ప ల్లెటూరి వాతావరణం వాడికి మేలు చేస్తుందని బలంగా నమ్మాను.నేను గ్రామీణ ప్రాంతా ల్లోనే జీవించాలని నిర్ణయించుకో డానికి అదీ ఓ కారణమని చెప్పాలి.
పల్లెటూరి సత్తా అది :
మనం వాడుతున్న చాటింగ్,ఈమెయిల్‌ ఆప్‌లు అమెరికావి! నాకో దశలో...మన డేటా అంతటినీ వాళ్లు మనకి వ్యతిరేకంగా వాడితే ఎలా అన్న భయం కలిగింది.అందుకే మనదై న ఈమెయిల్‌ రూపొందించాలని...జోహోమెయిల్‌ని ప్రారంభించాను. ‘వాట్సాప్‌’కి ప్ర త్యామ్నాయంగా అచ్చమైన తమిళ పదంతో ‘అరట్టై’ని మొదలు పెట్టాను.మన పల్లె టూరి యువతే వీటికోసం పనిచేశారు.ఎనిమిదేళ్ల తర్వాత...వాటికి ఇప్పుడు లక్షల డౌన్‌లోడ్‌లు వస్తుండటం చూస్తే ఆనందంగా ఉంది.
ఫోర్క్‌లు ఎందుకు? :
చెన్నైలో ఆఫీసు పెట్టిన కొత్తల్లో అక్కడున్న ఎగ్జిక్యూటివ్‌లూ ఉద్యోగులూ ఫోర్క్‌తో తినక పోతే చిన్నచూపు చూసేవాళ్లు.మన పద్ధతుల్ని కించపరచడం నాకు నచ్చలేదు.అందుకే, గ్రామీణ ప్రాంతాల్లో...పల్లెటూరి యువతతోనే సంస్థను నడిపి విజయం సాధించాలనుకు న్నాను.‘స్పోక్స్‌ అండ్‌ హబ్‌’ పేరుతో పల్లెటూళ్ళలో కంపెనీ శాఖల్ని ఏర్పాటు చేశాను. మొదట తమిళనాడు తెన్కాశిలోని మత్తలం పాళయానికి దగ్గర్లో ఉన్న సిల్లరైపురవు అనే ఊళ్లో ఆఫీసును ప్రారంభించి...నేనూ అక్కడే ఉండిపోయాను.
చాపమీదే...:
తెన్కాశికి దగ్గర్లో చిన్న ఇంట్లోనే ఉంటాను.చాపమీదే పడుకుంటాను.మా ఇంట్లో ఫ్యాన్‌ తప్ప ఏసీ ఉండదు.తెల్లవారుజా మున నాలుగింటికే నిద్రలేస్తాను. ప్రపంచ వ్యాప్తంగా ఉ న్న ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడాక...సైకిల్‌ మీద పొలానికి వెళ్లి పనుల్ని చూస్తుంటాను. ఊళ్లోని పిల్లలతో కలిసి చెరువులో ఈత కొడతాను.పనిమీద తెన్కాశి పట్టణానికి వెళ్లా లంటే నేనే ఎల క్ట్రిక్‌ ఆటో నడుపుకుంటూ వెళతాను.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...