కర్నూలు వాసుల అభిమానం మరువలేము... దర్శక,నిర్మాత శాంతికుమార్...

కర్నూలు వాసుల అభిమానం మరువలేము
దర్శక,నిర్మాత శాంతికుమార్

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిది :
తెలుగు సినీ పరిశ్రమ పట్ల కర్నూలు ప్రజలు చూపే అభిమానాన్ని మరువలేమని దర్శక,ని ర్మాత శాంతికుమార్ అన్నారు.బ్రహ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై 3.2.1 అనే టైటిల్ తో నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సందర్బంగా చిత్ర యూనిట్ కర్నూలుకు విచ్చేసింది.ఈ సంద ర్బంగా స్థానిక రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర దర్శకు డు,నిర్మాత శాంతికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎన్నో అందమైన లొకేషన్లు ఉ న్నాయని,తాము నిర్మిస్తున్న చిత్ర కథకు అనుగుణంగా సినిమా చిత్రీకరణ జరుగుతోందని అన్నారు.తాము షూటింగ్ నిర్వహిస్తున్న ప్రతి చోటా ప్రజలు సహకరిస్తున్నారని,కర్నూలు ప్రజల అభిమానాన్ని మరువలేమని పేర్కొన్నారు.సినిమా టైటిల్ గురించి వివరిస్తూ మూ డు ముళ్ళు,రెండు మనసులు,ఒక్క జీవితం అనే జీవిత సత్యం ఆధారంగా 3.2.1 అనే టైటి ల్ పెట్టామని చెప్పారు.ప్రేమ వివాహాలు,పెద్దలు కుదిర్చిన వివాహాల మధ్య రగులుతున్న భా వోద్వేగాలను విశ్లేషిస్తూ హీరో,హీరోయిన్ల నడుమ ఏర్పడిన సంఘర్షణ ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపామని శాంతి కుమార్ తెలిపారు.తమ చిత్రంలోని కాలేజీ సీన్లు చిత్రీక రించడానికి రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో అనుమతినిచ్చిన కళాశాల చైర్మన్ మోహన్ కు మార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వా రితో రిజిస్టర్ కాబడిన మొట్టమొదటి సినిమా తమదే కావడం తమకు గర్వకారణమని ఆ యన అన్నారు.ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బి.కె.కరణ్ మాట్లాడు తూ తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం తా ము ప్రత్యేకంగా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.తమ సంస్థ చై ర్మన్,మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సహకారంతో ఏపీలో చిత్ర పరిశ్రమ అభి వృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.ఈ ప్రాంతంలో నిర్మించే సినిమాలకు తాము అన్ని విధాల సహాయ,సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు.చిత్ర హీరో మోహిత్ మాట్లాడుతూ రాయలసీమలో సినిమా షూటింగ్ జరుపుకోవడం తమకు ఇదే మొదటిసా రని,అన్ని ప్రాంతాల సంస్కృతులు కర్నూలులో ఉన్నాయని అన్నారు.హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కర్నూలులో షూటింగ్ లో పాల్గొంటుంటే ఈ ప్రాంతం తమకు సొంత ప్రాం తంలా అనిపిస్తోందని ఆమె కొనియాడారు.ఈ కార్యక్రమంలో సహ నిర్మాత రామానుజ రెడ్డి,ఫిల్మ్ చాంబర్ పిఆర్ ఓ.నాగేశ్వరబాబు,చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...