వామ్మో మాములు సీన్ కాదు రాములా... త్రిల్లర్ క్రైం సినిమాకి మించి...

వామ్మో మాములు సీన్ కాదు రాములా
త్రిల్లర్ క్రైం సినిమాకి మించి
మాజీ ప్రియుడుతో సహజీవనం చేస్తున్న ప్రియుడుని లేపేసింది
లేపేసి...శవంపై నెయ్యి,వైన్ పోసి...వామ్మో

VS9TV న్యూస్,హైదరాబాద్ :
అతడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు.ఓ యువతిని ప్రేమించి సహజీవనం చేస్తున్నాడు. అ యితే ఆ యువతి ప్రైవేట్ వీడియోలను తీసి హార్డ్ డిస్క్‌లో సేవ్ చేశాడు.ఆమె డిలిట్ చేయ మని ఎంత మొత్తుకున్న వినలేదు.దీంతో ఆ యువతి ఓ కుట్రకు తెరదీసింది.వివరాలు ఇ లా ఉన్నాయి...దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన యూపీఎస్సీ అభ్యర్థి రామ్ కేశ్ మీనా హత్య కేసు చిక్కుముడి వీడింది.ఈ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.తిమార్‌పూర్‌ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన రామ్‌‌ది సాధా రణ మరణం కాదని...అది పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని పోలీసులు తేల్చారు.అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఈనెల 6న తిమార్‌పుర్‌లోని ఓ భవనంలో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది.ఘటనా స్థలంలో కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు గుర్తిం చారు.మృతుడిని 32ఏళ్ల రామ్‌కేశ్‌ మీనాగా గుర్తించారు.ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్ష లకు సిద్ధమవుతున్నారు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ దృశ్యాలను పరిశీలిం చగా...కీలక విషయాలు బయటపడ్డా యి.పేలుడుకు ముందు రోజు రాత్రి ముసుగులు ధ రించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి వెళ్లినట్లు కనిపించింది.కాసేపటి తర్వాత వారితో పా టు ఓ యువతి కూడా బయటకొచ్చింది.వీరు వెళ్లిపోయిన కాసేపటికే భవనంలో పేలుడు జరిగింది.హత్యకు కారణం ఆ వీడియోలే...సీసీటీవీలో కనిపించిన ఆ యువతిని ఫోరెన్సి క్ సైన్సెస్ విద్యార్థిని అమృతా చౌహాన్‌‌గా గుర్తించారు.రామ్‌కే శ్‌తో ఆమె సహజీవనం చే స్తోంది.పోలీసులు అమృతను అదుపులోకి తీసుకుని విచారించగా...ఈ హత్యకు తానే సూత్రధారి అని అంగీకరించింది.రామ్‌కేశ్‌ మీనా,అమృత ప్రైవేటు వీడియోలను రికార్డు చే సి హార్డ్ డిస్క్‌లో భద్రపరిచాడు.వాటిని డిలీట్ చేయాలని అమృత ఎంతగా కోరినా రామ్‌ కేశ్ నిరాకరించాడు.దీంతో అమృత తన మాజీ ప్రియుడు సుమిత్,మరో స్నేహితుడితో క లిసి అతడిని హత్య చేయడానికి ప్లాన్ వేసింది.నిందితులు రామ్‌కేశ్‌ను చంపిన తర్వాత అది అగ్నిప్రమాదంలా కనిపించేం దుకు భయంకరమైన కుట్రకు పాల్పడ్డారు.మృత దే హంపై నెయ్యి,నూనె,వైన్‌ చల్లి నిప్పంటించారు.వంట గదిలోని సిలిండర్ నుంచి గ్యాస్‌ లీ క్‌ అయ్యేలా చేసి ఫ్లాట్‌కు తాళం వేసి పారిపోయారు.ఈ మొత్తం కుట్రను పక్కాగా అమ లు చేసిన నిందితులను పోలీసు లు అరెస్టు చేశారు.హత్యకు దారితీసిన హార్డ్ డిస్క్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...