మోంధా తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం...జిల్లా స్థాయిలో,డివిజన్ల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు...

మోంధా తుఫాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం
జిల్లా స్థాయిలో,డివిజన్ల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు

VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :
మోంధా తుఫాను నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తంగా వుండాలని కర్నూలు జి ల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్ ప్రదీప్ కుమార్ ప్రకటనలో తెలిపారు.అలాగే చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎపిఎస్పిడిసిఎల్ తిరుపతి వారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పరిధి లోని కర్నూలు టౌస్,ఆదోని మరియు ఎమ్మిగనూరు డివిజన్ ల పరిధిలో తుఫాను కారణం గా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల ప ర్యవేక్షణకు డివిజన్స్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.తుఫా ను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడం కోసం అధికారులు / సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు అందుబాటులో వుండాలన్నారు.వ ర్షం కురుస్తున్న సందర్భాల్లో జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా వర్షాల వలన కలిగే విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండుటకు క్రింది సూచనలను పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ అధి కారి ఆర్.ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
భద్రత నియమాలు :
1.వర్షాలు,గాలులు ఎక్కువగా వస్తున్న ప్పుడు లేదా నీటి నిలువ ఎక్కువగా ఉన్న చోట క రెంటు స్తంభాలను తాకరాదు మరియు వాటి దగ్గర ఉండరాదు.
2. ఇంట్లో నిమ్ముగా ఉన్న లేదా తడిచిన స్విచ్ బోర్డ్ లను చేతులతో తాకకుండా పొడిగా ఉన్న కట్టి పుల్ల ద్వారా లేదా ప్లాస్టిక్ వస్తువుల ద్వారా స్విచ్ లను వేసుకోనవలెను.
3. కరెంటు వస్తువులను చేతులతో తాకరాదు.
4. రైతులు వారి విద్యుత్ మోటార్ల దగ్గర జాగ్రత్తగా వుండవలెను.
5. ఎక్కడైనా కరెంటు లైన్లు తెగి పడిన,స్తంభాలు విరిగి పడిన సంబంధిత లైనుమెస్ కి గా ని సంబంధిత సబ్ స్టేషన్ కి గాని కంట్రోల్ రూమ్ లకుగాని వెంటనే తెలియపరచవలెను. వీటిని తాకరాదు.
6. విద్యుత్ సమస్యల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్ 1912 లేదా 1800425155333 కు కాల్ చేసి సమాచారం అందించాలి.
7. ప్రజల సౌకర్యార్థం అతి భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్యలపై జిల్లా లోని మూడు విద్యుత్ డివిజన్లో మూడు కంట్రోల్ రూమ్ లు జిల్లా కేంద్రంగా ఒక కంట్రోల్ రూమ్ ను మొత్తం నాలుగు కంట్రోల్ రూములను ఏర్పాటు చేశాము.విద్యుత్ సమస్యలపై ఈ కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి పరిష్కరించుకోవాలి.
8. కంట్రోల్ రూమ్ పేరు,ఫోన్ నెంబరు :
1) కర్నూలు (జిల్లా కంట్రోల్ రూమ్) : 7382614308,08518-257420.
2) కర్నూలు డివిజన్ : 7382613905,08518-221919.
3) ఎమ్మిగనూరు డివిజన్ : 7396420036,9676600466.
4) ఆదోని డివిజన్ : 9502382145,08512-253455.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...