బెట్టింగ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న అంబర్‌పేట్ ఎస్సై...

బెట్టింగ్ అప్పుల ఊబిలో చిక్కుకున్న అంబర్‌పేట్ ఎస్సై
రికవరీ కేసులో స్వాధీనం చేసుకున్న బంగారం స్వాహా
సర్వీస్ గన్‌ను తాకట్టు పెట్టినట్లు తీవ్రఆరోపణలు
ఎస్సై భాను ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్

VS9TV న్యూస్,హైదరాబాద్ :
హైదరాబాద్ పోలీస్ శాఖలో ఓ ఎస్సై నిర్వాకం తీవ్ర కలకలం రేపుతోంది.బెట్టింగ్ వ్యస నంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఏకంగా తన సర్వీస్ తుపాకీతో పాటు,కేసులో స్వాధీ నం చేసుకున్న బంగారాన్ని తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అంబర్‌ పే ట్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై భాను ప్రకాశ్ బరితెగింపు పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా మారింది.వివరాల్లోకి వెళ్తే...ఎస్సై భాను ప్రకాశ్ బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది.ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అడ్డదారు లు తొక్కాడు.ఓ రికవరీ కేసులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఐదు తులాల బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది.ఈ విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.అంతేకాకుండా భానుప్రకాశ్ వద్ద ఉం డాల్సిన సర్వీస్ గన్ కనిపించకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది.ఈ విషయంపై వారు నిలదీయగా,ఎస్సై నుంచి సరైన సమాధానం రాలేదు.దీంతో లోతుగా విచారించగా,బంగారంతో పాటే తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మా రింది.బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటంపై సర్వత్రా విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రస్తుతం ఎస్సై భానుప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమ అ దుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...