డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు...సెలవు తీసుకోవాల్సిందే...తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు...

డ్యూటీలో మతపరమైన దీక్షలు కుదరవు
సెలవు తీసుకోవాల్సిందే
విధి నిర్వహణలో దీక్షా వస్త్రాలు ధరించవద్దని ఆదేశం
నిబంధనలు ఉల్లంఘించిన కంచన్‌బాగ్‌ ఎస్సైకి మెమో
గడ్డం,జుట్టు పెంచడంపైనా నిషేధం
తెలంగాణ పోలీసు శాఖ కఠిన ఆదేశాలు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
తెలంగాణ పోలీసు శాఖ తమ సిబ్బంది మతపరమైన దీక్షలు చేపట్టడంపై కీలక, కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.అయ్యప్పదీక్ష వంటి మతపరమైన దీక్షల్లో ఉన్నవారు విధి నిర్వ హణకు హాజరుకాకూడదని,తప్పనిసరిగా సెలవు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఈ ని బంధనలను ఉల్లంఘించి డ్యూటీలో దీక్షా వస్త్రాలతో కనిపించినందుకు సౌత్ ఈస్ట్ జోన్‌కు చెందిన కంచన్‌బాగ్‌ ఎస్సై కృష్ణకాంత్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు.ప్రస్తు తం అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మంది సిబ్బంది మాల ధరించారు.ఈ నేపథ్యంలో పోలీసు శాఖ ఈ కొత్త మార్గదర్శకాల ను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.విధి నిర్వహణలో ఉన్న పోలీసులు యూనిఫామ్ లేకుండా నల్లదుస్తులు,నల్ల కండువాలు ధరించడం,షూస్ లేకుండా తిరగ డం వంటివి చేయరాదని హెడ్ ఆఫీస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.అలాగే, పోలీసులు విధుల్లో ఉన్నప్పుడు జుట్టు,గడ్డం పెంచుకోవద్దని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది.అయితే,మ తపరమైన దీక్షలను శాఖ వ్యతిరేకించడం లేదని,క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఉ న్నతాధికారులు చెబుతున్నారు.దీక్ష చేపట్టాలను కునే వారు ముందస్తుగా అనుమతి తీసు కుంటే రెండు నెలల వరకు సెలవులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపా రు.దీక్షలో ఉంటూ విధులకు హాజరుకావడం మాత్రం నిబంధనలకు విరుద్ధమని తేల్చిచె ప్పారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...