జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాళాశాలలో కృత్రిమ మేథ,మెషిన్ లెర్నింగ్ పై ఐదు రోజులు ఎఫ్ డిపి విజయవంతం...

జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాళాశాలలో కృత్రిమ మేథ,
మెషిన్ లెర్నింగ్ పై ఐదు రోజులు ఎఫ్ డిపి విజయవంతం 

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు నగరం,జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాళాశాలలో (ఆటోనోమస్),కర్నూలులోని కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగం (CSM) ఆధ్వర్యంలో అప్లైడ్ మెషిన్ లె ర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ యూసింగ్ ఇంటల్ ఉన్నతి ఏకోసిస్టం అనే అంశంపై ఐదు రో జుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్ డిపి)ను ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వ రకు విజయవంతంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమం బెంగుళూరులోని ఎడ్గేట్ టె క్నాల జీస్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో జరిగింది.ఈ ఎఫ్ డిపి లక్ష్యం అధ్యాపకులకు కృత్రి మ మేథ,మెషిన్ లెర్నింగ్,డీప్ లెర్నింగ్ వంటి ఆధునిక రంగాలలో నైపుణ్యాలను అందించ డం.ఈ కార్యక్రమం క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఇంటెల్ ఉన్నతి ఎఐ ల్యాబ్ ద్వారా ప్రాక్టిక ల్ శిక్షణను అందించింది.ఈ శిక్షణను ఎడ్గేట్ టెక్నాలజీస్ లో ఎఐ ఇంజినీర్ సుహాస్ అం దించారు. ఆయన ప్రామాణిక డేటాసెట్లను ఉపయోగించి మోడల్ నిర్మాణం మరియు అ మలులో పాల్గొన్న అధ్యాపకులకు మార్గ నిర్దేశం చేశారు.ఈ ఎఫ్ డిపిని ప్రిన్సిపాల్ డా.బి. శ్రీనివాస రెడ్డి హాజరై ప్రారంభించారు.డా.ఆర్.ప్రవీణ్ సామ్,కంప్యూటర్ సైన్స్ అండ్ మెషి న్ లెర్నింగ్ విభాగాధిపతి,పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ గమనంతో పాల్గొన డం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ కార్యక్రమాన్ని డా.ఏ.విష్ణువర్ధన్ రెడ్డి,అసోసి యే ట్ ప్రొఫెసర్ మరియు ఇంటెల్ ఉన్నతి ల్యాబ్ కన్వీనర్ సమన్వయంతో నిర్వహించా రు.క్యాంపస్లోని అనేక విభాగాల నుండి ఫ్యాకల్టీ సభ్యులు ఈ కార్యక్రమంలో ఉత్సాహం గా పాల్గొన్నారు.ఈ ఎఫ్ డిపి ద్వారా జిపి ఆర్ ఈసి తన అధ్యాపకుల సాంకేతిక నైపు ణ్యాలను అభివృద్ధి చేయడానికి,పరిశ్రమ స్థాయి సాంకేతికతలను విద్యావ్యవస్థలో సమ ర్థంగా కలిపేందుకు తీసుకుంటున్న కృషి స్పష్టమవుతోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...