డబ్బు కోసమే తప్పు చేశా...ఇకపై పైరసీ జోలికి వెళ్లను... I BOMMA రవి...

డబ్బు కోసమే తప్పు చేశా...ఇకపై పైరసీ జోలికి వెళ్లను
పోలీసుల కస్టడీలో నోరు విప్పిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి
విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించానన్న నిందితుడు
ఆరేళ్లుగా దొరక్కపోవడంతో నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు వెల్లడి

VS9TV న్యూస్,హైదరాబాద్ :
పైరసీ సినిమాల కేసులో అరెస్టయిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీ సుల కస్టడీలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.శుక్రవారంతో రెండో రోజు వి చారణ ముగియగా,ఉదయం నుంచి మౌనంగా ఉన్న రవి మధ్యాహ్నం తర్వాత పెదవి వి ప్పినట్లు సమాచారం.విదేశీ పౌరసత్వం ఉండ టంతో పైరసీ గుట్టు బయటపడినా చట్టం నుంచి సులభంగా తప్పించుకోవచ్చని భావించినట్లు రవి అంగీకరించినట్లు తెలిసింది.గత ఆరేళ్లుగా తనను ఎవరూ పట్టుకోలేకపోవడంతో,అదే ధీమాతో తన నెట్‌వర్క్‌ను దేశ,విదే శాల్లో బలోపేతం చేశానని విచారణలో వెల్లడించాడు."మొదట్లో కేవలం డబ్బు సంపాదిం చాలనే ఆలోచనతో చేశాను.చేస్తున్నది తప్పని గుర్తించలేకపోయాను"అంటూ పోలీసు ల ఎదుట పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు సమాచారం.జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తి గా మారిపోతానని,మళ్లీ పైరసీ జోలికి వెళ్లనని పోలీసులను వేడుకున్నట్లు తెలిసింది.మ రోవైపు,ఈ కేసులో పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యా రు.రవికి దేశ,విదేశాల్లో ఉన్న ఏజెంట్లు,ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...