సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి... ఒకరోజు లాభం కోసం,నూరేళ్ల నష్టం తెచ్చుకోకండి...అభ్యర్థులకు గ్రామాల పెద్దల సూచన...

సర్పంచ్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టకండి
ఒకరోజు లాభం కోసం,నూరేళ్ల నష్టం తెచ్చుకోకండి
అభ్యర్థులకు గ్రామాల పెద్దల సూచన

VS9TV న్యూస్,హైదరాబాద్ :
గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపు కోసం భారీగా డబ్బు ఖర్చు పెడుతున్న దృశ్యం మరో సారి ఎన్నికల వేళ హాట్‌టాపిక్ అయింది.పోయిన సారి గెలిచిన సర్పంచ్‌లతో ఒక్కసారి మాట్లాడండి...సుఖానికి వచ్చినా సొమ్ము పోదు...బాధకు వచ్చినా బుద్ధి రాదు...అనేలా వారు పడిన ఇబ్బందులు తెలుసుకుంటే అభ్యర్థులే కాదు,ఓటర్లూ షాక్ అవుతారు అని గ్రా మ పెద్దలు చెబుతున్నారు.గత సారి గెలిచిన అనేక మంది సర్పంచ్‌లు ఈసారి పోటీలో ని లబడేందుకు కూడా ధైర్యం చేయకపోవడం వెనుక అసలు కారణం.అప్పుల భారం,ఆర్థిక ఒత్తిడి.వద్దన్నా వడగళ్ల వాన...కోరన్నా కోడి గుడ్డు...అన్నట్లుగా అభివృద్ధి పనులు,ప్రజా ఒ త్తిళ్లు,రాజకీయ లెక్కలతో వారు సహనం కోల్పోయి చాలామంది పక్కన కూర్చున్నారు.
ఓటర్లకు హెచ్చరిక ...ఒకసారి డబ్బు తీసుకుంటే మీ నోరు మీరే కట్టేసుకున్నట్టే :
ఓటర్లు కూడా ఓటు వేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాలి.మీ గ్రామం ఇప్పటి వర కు ఎంత అభివృద్ధి చెందింది ? ఎందుకు వెనకపడుతోంది ? ఓటుకు ఒక్కరోజు ఇచ్చే రూ.500,రూ.1,000, రూ.1,500,రూ.2,000,రూ.3,000...కొన్నిచోట్ల రూ.5,0 00 కోసం గ్రామ భవి ష్యత్తునే తాకట్టు పెట్టడం చెయ్యి ఇచ్చి చెంప కొట్టించుకున్నట్టు... అవుతుందని పెద్దలు హెచ్చరిస్తున్నారు.కొంచెం ప్రయోజనానికి పెద్ద నష్టం తెచ్చుకోకు... రోజుకి దొరికిన చిల్లరకి రేపటి అన్నం అమ్ముకోకు...అన్నట్లుగా ఓటరు డబ్బు తీసుకునే నిర్ణ యం మొత్తం గ్రామాన్ని వెనక్కి నెట్టేస్తోంది.
నిజాయితీ ఉన్న అభ్యర్థిని గెలిపించండి నిజం నిలుస్తుంది,నిధులు కాదు :
డబ్బు ఖర్చు చేయకుండా,నిజాయితీగా పనిచేయాలనుకునే అభ్యర్థిని అందరూ కలిసి గెలి పిస్తే గ్రామం అభివృద్ధి దిశగా బలంగా అడుగులు వేయగలదు.మనసున్నవాడికి మార్గం ఉ న్నట్టు... మంచి నాయకుడికి ప్రజల మద్దతు లభిస్తే గ్రామానికి కావాల్సిన పనులు కూడా సులభంగా సాధ్యమవుతాయి.కానీ ఓటర్లు డబ్బు తీసుకున్న క్షణం నుంచే తినిన వాడే నో రు మూసుకుంటాడు...అన్న చందం జరిగుతుంది.తర్వాత అభివృద్ధి అడిగే హక్కే ఉండ దు.గ్రామ అభివృద్ధి కోసం ఈసారి అయినా ప్రజలు మేల్కొని,డబ్బు లేకుండా స్వచ్ఛమైన ఎ న్నికలు జరిపి,నిజాయితీగల నాయకుడిని ఎన్నుకోవాలని పెద్దలు పిలుపు ఇస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...