డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో సుమలత ఘనవిజయం...

డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో సుమలత ఘనవిజయం
VS9TV న్యూస్,హైదరాబాద్ :
తెలుగు సినిమా,టీవీ డాన్సర్స్ అసోసి యేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరి యోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సా ధించారు.మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోలవ్వగా…సుమలతకు 228 ఓట్లు వచ్చాయి.ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్ర కాశ్ మాస్టర్‌కు 199ఓట్లు మాత్రమే దక్కా యి.మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11ఓట్లు లభించాయి.ఈ ఫలితాలతో 29 ఓట్ల భారీ మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.ముఖ్యంగా ఎలాంటి గ్రూప్ సపోర్టు,పెద్దల బలమైన బహిరంగ మద్ద తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజ యం సాధించడం డాన్సర్స్ అసోసియేష న్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ ఎన్నికల్లో సుమలత విజయం అంత సులువుగా జరగలేదనే చెప్పాలి.ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు శేఖర్ మాస్టర్,భాను మాస్టర్,రఘు మాస్టర్, పొల్లకి విజయ్,జోజో శామ్,చంద్రకిరణ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరం గంగా మద్దతు ప్రకటించారు.అలాగే గతం లో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి ఆయన జైలుకు వెళ్లడానికి కారణమైన డాన్సర్ సృష్టి వర్మ కూడా ఉదయం నుంచే ఎన్ని కల హాల్‌లో ఉండి జోసెఫ్ ప్రకాశ్‌కు మద్ద తుగా గట్టిగా ప్రచారం చేశారు.జానీ మాస్టర్ భార్యని ఎలాగైనా ఓడించాలన్న కసితో ఆమె తిండి కూడా తినకుండా గంటల తరబడి అక్కడే ఉండి ఓట్లను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన విధానం ఎన్నికలను మరింత రసవత్త రంగా మార్చేసింది.సుమలతను ఓడించా లనే లక్ష్యంతో సృష్టి వర్మ చేసిన ప్రయ త్నాలు చివరకు ఫలించలేదు.గ్రౌండ్ లె వల్‌లో సుమలతకు లభించిన మద్దతు ముందు అన్ని లెక్కలు తారుమార య్యాయి.సీనియర్ మాస్టర్ల మద్దతు ఉన్నప్పటికీ జోసెఫ్ ప్రకాశ్ పరాజయం పాలవడం...ఎలాంటి క్యాంప్ పాలిటిక్స్ లేకుండా సుమలత గెలవడం అసోసి యేషన్‌లో కొత్త చర్చకు తెరలేపింది. డాన్సర్స్‌లో నమ్మకం,వ్యక్తిగత అను బంధం ఎంత ముఖ్యమో ఈ ఎన్నికల ఫలితం చెప్పకనే చెప్పింది.సింపుల్ క్యాం పెయిన్,స్పష్టమైన మాట,నిజాయితీనే తన బలం అంటూ సుమలత ముందుకు వెళ్లిన తీరు చాలా మందికి ఆకట్టుకుంది.ఈ విజయం వెనుక సుమలత జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు కూడా ఒక కారణంగా పలువురు పేర్కొంటున్నారు. గతంలో జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణ ల సమయంలో ఆమె ఎదుర్కొన్న మాన సిక ఒత్తిడి అంతా ఇంతా కాదు.ఆ సమ యంలో భర్తపై ఆరోపణలు రావడంతో కు టుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. అయినప్పటికీ సుమలత భర్తకు అండగా నిలిచారు.కోర్టు కేసుల్లో,పోలీసు విచార ణల్లో జానీ మాస్టర్‌కు ధైర్యం చెప్పుతూ… న్యాయ పోరాటంలో అతనితో పాటు ముందుకు నడిచారు.చాలా మంది వెన క్కి తగ్గిన సమయంలో ఆమె మాత్రం భర్త నిర్దోషేనన్న నమ్మకంతో దృఢంగా నిలబడటం ఇండస్ట్రీలో పలువురిని ఆకట్టుకుంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...