పోలీసుశాఖలో హోంగార్డుల విధులు,సేవలు ప్రశంసనీయం...జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

పోలీసుశాఖలో హోంగార్డుల విధులు,సేవలు ప్రశంసనీయం
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
సమాజసేవలో,శాంతి భద్రతల పరిరక్ష ణలో హోంగార్డులు సేవలు పోలీసులతో సమానం అని,వారి సేవలు ప్రశంసనీయం అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కొనియాడారు. కర్నూ లు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 63వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ హోంగార్డు రైజింగ్ డే సంధర్బంగా నిర్వహించిన క్రీడల పో టీలలో గెలుపొందిన హోంగార్డు సిబ్బంది విజేతలకు బహుమతుల ప్రధానం కార్యక్రమా నికి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై బహుమతులు అందచేశారు.
ముందుగా సాయుధ హోంగార్డుల ప్లటూన్ల నుండీ గౌరవ వందనం స్వీకరించారు.ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ...పోలీసులతో సమానంగా హోం గార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయమన్నారు.1963 సంవత్సరంలో ఆవిర్భ వించిన హోంగార్డు వ్యవస్థ పోలీసు శాఖలో కీలకంగా మారిందన్నారు.పోలీసులతో స మానంగా శాంతిభద్రతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తున్నారన్నారు.అన్ని విభాగాలు, బందోబస్తు విధులలో బాగా పని చేస్తున్నారన్నారు.
సాధారణ డ్యూటీలు మొదలుకొని,క్లిష్టతర విధుల వరకు అన్నింటా చక్కగా పని చేస్తు న్నారన్నారు.పారదర్శకంగా,నిజాయితీగా పని చేయాలన్నారు.క్రమ శిక్షణతో మెలుగు తూ పోలీసు ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో అంకితభావంతో పని చేయాలన్నారు.పోలీసు సిబ్బందితో సమానం గానే హోంగార్డుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.అనంతరం పరేడ్ పరి శీలన వాహనంపై వెళ్లి ప్లటూన్లను పరిశీలించారు.అదేవిదంగా పదవి విరమణ పొందిన (శ్రీనివాస శెట్టి,శేషమ్మ,వీరమ్మ,హసినా బేగం) నలుగురు హోంగార్డులను జిల్లా ఎస్పీ శా లువ,పూలమాలతో సన్మానించారు.
ఒక్కొక్కరికి రెండు లక్షల కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ కార్యక్ర మంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్,క ర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్,మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్ర బాబు,హోమ్ గార్డ్ డిస్పీ ప్ర సాద్,పోలీసు వేల్పేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి,సిఐలు మధుసుధన్ రావు,చంద్రబాబు నాయుడు,నాగరాజా రావు,మన్సురుద్దీన్,ఆర్ ఐలు పోతలరాజు,జావేద్,నారాయణ,ఆర్ ఎస్సైలు మహేశ్వరరెడ్డి,హుస్సేన్,ప్రదీప్,కల్పన,మహాలక్ష్మీ,పోలీసు,హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...