ఐ బొమ్మ రవిని కస్టడీకి తీసుకోని పోలీసులు...

ఐ బొమ్మ రవిని కస్టడీకి తీసుకోని పోలీసులు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
ఐబొమ్మ రవి కేసు విషయంలో పోలీసు లకు స్పష్టత ఉన్నట్లుగా కనిపించడం లేదు.ఇప్ప టికి రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారు.మూడో సారి కూడా కస్టడీకి కావాలని పిటిషన్ వే సి మూడు రోజుల అనుమతి తెచ్చుకున్నారు.ఇవాళ నుంచి మూడు రోజుల పాటు ప్రశ్నిం చాల్సి ఉంది.అనూహ్యంగా పోలీసులు యూటర్న్ తీసుకున్నారు.ఆయనను కస్టడీకి తీసు కోకుండా కోర్టులో పిటిషన్ వేశారు.మూడురోజుల సమయం సరిపోదని ఆ పిటిషన్ సా రాంశం.మూడో సారి కస్టడీకి అనుమతి పొంది...మూడు రోజులు సరిపోదని పిటిషన్ వే యడం పోలీసులకే చెల్లింది.ఇంకా కొన్ని రోజులు కావాలని అడిగేందుకు ఇప్పుడు కస్టడీకి తీసుకోకపోవడం కూడా విచిత్రంగా ఉంది.కావాలంటే మూడు రోజులు ప్రశ్నించి తర్వాత ఇంకా సమాచారం రాబట్టాలని ఉందని పిటిషన్ వేసుకోవచ్చు.కానీ అలా చేయలేదు.అ సలు కస్టడీకే తీసుకోలేదు.దీని వెనుక బెయిల్ రాకుండా చేయాలన్న వ్యూహం ఉందన్న అనుమానాలు రవి తరపు లాయర్లలో వ్యక్తమవుతున్నాయి.మూడు రోజుల కస్టడీకి వచ్చి నందున కస్టడీ పూర్త యిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ పై విచారణ చేస్తామని కోర్టు చెప్పింది.మూడురోజుల కస్టడీ తీసుకుంటే తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులాగే..టెక్నికల్ అంశాలతో ముడిపడిన పైరసీ కేసునూ సాక్ష్యాలతో నిరూపించడం సాధ్యం కాకపోవచ్చు.బలమైన ఆధారాలు దొరికాయో లేదో స్పష్టత లేదు.ఆయన పైరసీ చేయలేదని...టెలిగ్రామ్ లో కొన్నారని పోలీసులు చెబుతు న్నారు.అక్కడే కేసు తేలిపోయిందని లాయర్లు అంటున్నారు.అయితే ఎక్కువ కాలం జైల్లో ఉంచేందుకు బెయిల్ రాకుండా చేసేందుకు పోలీసులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నార న్న అభిప్రాయం వినిపిస్తోంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...