రౌడీలను కాదు వారికి అండగా నిలిచే నాయకులను నడిపిస్తే నిజమైన మార్పు వస్తుంది...

రౌడీలను కాదు వారికి అండగా నిలిచే నాయకులను
నడిపిస్తే నిజమైన మార్పు వస్తుంది

vs9tv న్యూస్,అమరావతి ప్రతినిది :
మిలటరీ కవాతు చేసినట్లు,నెల్లూరు రోడ్ల మీద రౌడీలను నడిపించారు పోలీసులు. వీళ్లం దరూ రౌడీలు అని జనం గుర్తించేట్లు చేశారు.రౌడీయిజానికి పాల్పడితే జైలుకు పంపు తామని కఠినమైన స్వరంతో హెచ్చరిక చేశారు.వారి ప్రయత్నం హర్షించదగిందే. సందే హం లేదు.అయితే రౌడీలకు పోలీసు లాఠీదెబ్బలు,అడపదడపా జైలులో విశ్రాంతి అలవా టే.వాటి వల్ల రౌడీలలో మార్పు రాదు.రౌడీతనానికి మూలం రాజకీయంలో దాగివుంది. రాక్షసుడి ప్రాణం మర్రిచెట్టు తొర్రలోని చిలుక కంఠంలో దాగి వున్నట్లు,రౌడీల దుర్మార్గ ప్ర వర్తన రాజకీయవాదుల ఆశ్రయంలో భద్రంగా వుంటుంది.ఎమ్మెల్యే లేదా మాజీ ఎమ్మెల్యే లు,వారిని అంటిపెట్టుకొని వుండే ఛోటా నేతలు,మరీ ముఖ్యంగా కార్పొరేటర్లు,మాజీ కా ర్పొరేటర్లు... ఇదంతా ఒక విషపూరితమైన కూటమి.ప్రతి రౌడీకి వీరిలో ఎవరో ఒకరి అం డ వుంటుంది.రాజకీయవాది ఆశ్రయం లేకుండా రౌడీ బ్రతకలేడు.రౌడీ తోడు లేకుండా రాజకీయవాది దినచర్య గడవదు.నిజంగా రౌడీయిజం రూపుమాపాలంటే,ముందుగా హె చ్చరిక చేయవలసింది రాజకీయవాదులకు.రౌడీలను వెనకేసుకొని వచ్చినా,వారిని వదలి పెట్టమని పోలీసు స్టేషన్‌కు ఫోన్‌ చేసినా,కేసులలో వున్నప్పుడు వారు అజ్ఞాతవాసం చే యడానికి సహాయం చేసినా,ఆ రౌడీ మీద వుండే నేరారోపణ మీ మీద నమోదు చేస్తా మని రాజకీయ వాదులకు హెచ్చరిక చేయగలిగే సాహసం అధికారులలో వుండాలి.అందు కు వారికి ప్రభుత్వం అండగా నిలవాలి.రాజకీయవాదుల ప్రాపకంలో వుండే కార్పొరేటర్లు తామే రౌడీలుగా రెచ్చిపోతున్నారు.కార్పొరేషన్‌,రెవెన్యూ,పోలీసు శాఖల మీద దాష్టీకం చేస్తున్నారు.గత వారమే కార్పొరేషన్‌ కార్యాలయంలో సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ వంటి సీని యర్‌ హోదాలో వున్న మహిళా అధికారిణిని ఒక కార్పొరేటర్‌ భర్త అసభ్యంగా తూలనాడి తే,ఎవరూ పట్టించుకోలేదు.విరక్తి చెందిన ఆమె ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్లిపోయారు. అధికారులకు అండగా నిలవ వలసిన కలెక్టర్‌ వంటి ఉన్నతాధికారులు కానీ,మంత్రులు కా నీ నిస్సహాయులుగా వుండి పోతున్నారు.రాజకీయ రౌడీల బారినపడి,నానా బాధలు ప డుతున్న దిగువస్థాయి సిబ్బందికి,అధికారులకు ఎటువంటి సహాయం అందడం లేదు. అం దువల్లనే ఆయా శాఖలు నిర్వీర్యమైపోతున్నాయి.నిజంగా రౌడీతనం అంతం కావాలంటే నడిపించవలసింది రౌడీలను కాదు.ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు,మాజీ ఎమ్మెల్యేలను రంగడి గుడి నుంచి అయ్యప్పగుడి వరకు వీధులలో నడిపించి,మేము ఏ రౌడీకి మద్దతు ఇవ్వము, ఏ రౌడీని మా పక్కన పెట్టుకోము అని జనానికి చెప్తూ నడిపిస్తే,నిజమైన మార్పు వస్తుంది అని రాజకీయ విశ్లేషకులు,ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...