అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం...తొలి తెలుగు నటి ప్రగతి మహావాది...

అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకం 
తొలి తెలుగు నటి ప్రగతి మహావాది

VS9TV న్యూస్,హైదరాబాద్ :
పట్టుదల ఉంటే అసాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు టాలీవుడ్ నటి ప్రగతి మహా వాది.క్యారెక్టర్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందిన ప్రగతి సరదాగా జిమ్ ప్రారంభించి వెయిట్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేసి కేవలం రెండేళ్ల సాధనలోనే రాష్ట్ర,జాతీయ స్థాయికి వెళ్లారు. ఇప్పుడు ఏకంగా ఆసియా గేమ్స్ లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు.ఒక స్వ ర్ణం,రెండు కాంశ్య పతకాలను గెలుచుకుని భారతీయ జెండా రెపరెపలాడించారు.మొద టి నుంచి ప్రగతి భిన్నమైన మనస్తత్వంతో ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు.సినిమాలో తనకిచ్చిన పాత్రలో సహజంగా నటించి మంచి నటి అని పేరు తెచ్చుకున్నారు.తను ఉండే గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంలో సైతం బుల్లెట్ పై తిరుగుతూ బుల్లెట్ యాక్ట్రెస్ అని గుర్తింపు పొందారు.49ఏళ్ల వయసులో టర్కీలో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొన్నారు.105కిలోల విభాగంలో స్వర్ణ పతకం కైవసం చే సుకున్నారు.ఈ ఏడాది ప్రగతికి బాగా కలసి వచ్చిందనే చెప్పుకోవాలి.హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్ గా నిలిచి,ఆ వెంటనే తెలంగాణ ఛాంపియన్ అయ్యారు.కేరళలో జరిగిన జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని స్వర్ణం పట్టి,భారత్ కు ప్రాతిని ధ్యం వహించి టర్కీ లోనూ తన సత్తా చాటుకున్నారు.వయసు జస్ట్ నెంబర్ మాత్రమేనని ఇండియా యువతకు గొప్ప స్ఫూర్తినిచ్చారు.అంతర్జాతీయ పోటీల్లో పతకం సాధించిన తొలి తెలుగు నటిగా అరుదైన నటిగా ప్రగతి మహావాది సరికొత్త రికార్డ్ సృష్టించారు.ఇది ప్రగతి విజయగాథ... చరిత్రలో నిలిచిపోయిన సక్సెస్...ఆమె జీవితంలో ఇదొక గొప్ప మ లుపు...వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్,టాలీవుడ్ నటి ప్రగతికి అభినందనలు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...