వైరల్ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి...కేరళలో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు...

వైరల్ వీడియోతో ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి 
కేరళలో మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో సంచలన ఘ టన చోటుచేసుకుంది.బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ దీపక్ అనే వ్యక్తిపై ఓ మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం,ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారాన్ని తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకోవ డం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే...కోజికోడ్‌లో బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో దీపక్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఓ మహిళ వీడియో రికార్డు చేసింది.అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వేగం గా వైరల్ అయ్యింది.ఈ పరిణామాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన దీపక్,స మాజంలో తనపై వచ్చిన అపకీర్తిని తట్టు కోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు,దీపక్ ఆత్మహత్యకు మహిళ చర్యలే కారణమని భావించి ఆమెపై కేసు నమోదు చేశారు.కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్‌లో మహి ళపై ఆత్మహత్యకు పురిగొల్పినట్లు (అబె ట్‌మెంట్ ఆఫ్ సూసైడ్) ఎఫ్ఐఆర్ నమో దు చేసినట్లు పోలీసులు తెలిపారు.వైరల్ వీడియో వల్ల దీపక్ తీవ్ర అవమానానికి గురై మానసికంగా కుంగిపోయాడని ప్రాథ మిక విచారణలో తేలిందని వెల్లడించారు. ఈ ఘటన సోషల్ మీడియా వినియో గంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఆరోపణలు చేసే ముందు,వీడియోలను బహిరంగంగా షేర్ చేసే ముందు పరిణా మాలను ఆలోచించాల్సిన అవసరం ఉం దని పలువురు అభిప్రాయపడుతున్నా రు.అదే సమయంలో,నిజానిజాలపై పూర్తి స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...