35వ వార్డు మాదిరాజు నగర్ లో కాలువలు శుబ్రం చేయాలి...పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి...CPM...

35వ వార్డు మాదిరాజు నగర్ లో కాలువలు శుబ్రం చేయాలి 

పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలి

సిపిఎం

VS9TB న్యూస్,కల్లూరు :

కల్లూరు అర్బన్ పరిధి,35వార్డులో కాలువలు శుభ్రం చేయాలని,పెంచిన ట్రూ ఆఫ్ చార్జీలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 35 వార్డు మాదిరాజు నగర్ లో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె.సుధాకరప్ప,నగర కమిటీ సభ్యురాలు జి.ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని,వాటిని పరిష్కరించడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా వైపల్యం చెందారని తెలిపారు.మంచినీరు రోజు రావడం లేదని రోజు మరిచి రోజు నీళ్లు వస్తున్నాయని అలాగే కాలువలు శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని, పందులు విపరీతంగా సంచరిస్తున్నాయని అన్నారు.కరెంట్ ట్రూ ఆఫ్ చార్జీలు విరితంగా పెరిగాయని, కరెంటు చార్జీలు పెంచడం ప్రజలపై భారం పెరిగిందని,ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ఇక్కడ నివసించే చాలా మంది పేదలకు సొంత ఇల్లు లేక బాడుగ కట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రెండు సెంట్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పై సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తేదీన కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎస్.శారదమ్మ,కె.నాగేశ్వరి, కె.వి.ఎన్.కన్యక,కె.సువార్త,పి.సాలమ్మ,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...