టికెట్‌పై రూ.40 అదనంగా వసూళ్లు... థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ...

టికెట్‌పై రూ.40 అదనంగా వసూళ్లు

థియేటర్‌నే సీజ్ చేయించిన మహిళ

VS9TV న్యూస్,అంబేద్కర్,కోనసీమ :

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో "కోర్టు" సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ అనే థియేటర్‌ యాజమాన్యంపై అమలాపురం ఆర్డీఓ కె.మాధవి చర్యలు తీసుకున్నారు.ఈ థియేటర్‌లో టికెట్లు రూ.40 ఎక్కువ చేసి అమ్ముతున్నారని అధికారులకు ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు.నిజమేనని తేలడంతో ఆర్డీఓ చర్యలు చేపట్టారు.థియేటర్‌ సీజ్‌ చేశారు.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, అమలాపురంలో ఓ మహిళ వచ్చి టిక్కెట్టు కౌంటర్‌ వద్దకు వెళ్లి కోర్టు సినిమాకు రెండు ఫస్ట్‌క్లాస్‌ టిక్కెట్లు కావాలని అడిగారు. రూ.300 ఇచ్చుకుని రెండు టిక్కెట్లు ఇచ్చాడు కౌంటర్‌లో టిక్కెట్టు అమ్ముతున్నారు.టిక్కెట్టు తీసుకున్న ఆమె నేరుగా థియేటర్‌లోకి వెళ్లకుండా అదే కౌంటర్‌లోకి రావడంతో అంతా షాక్ అయ్యారు.ఆ మహిళ వెంట సబార్డినేట్‌,స్థానిక తహసీల్దార్‌ ఉండడంతో ఆమె నార్మల్‌ వ్యక్తి కాదని తెలిసింది.ఆమె సినిమా చూడడానికి రాలేదని తనిఖీల కోసం వచ్చిన అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అని తేలింది."కోర్టు" సినిమాకు రూ.110 టిక్కెట్టు అమ్మాల్సి ఉంది.కానీ సాధారణ మహిళగా వచ్చిన ఆర్డీఓకే రూ.150 అమ్మడంతో థియేటర్‌ యాజమాన్యం అడ్డంగా బుక్ అయింది.లైవ్‌ సాక్ష్యాలు ఉండటంతో చర్యలకు ఉపక్రమించారు ఆర్డీఓ మాధవి.కేవలం "కోర్టు" సినిమాకే కాదు ఈ థియేటర్‌లో ఆడుతున్న ప్రతి సినిమాకు ధరలు పెంచి అమ్ముతున్నారని రికార్డుల ఆధారంగా గుర్తించారు. థియేటర్‌ అనుమతుల రెన్యువల్‌ గడువు ముగిసినప్పటికీ సినిమాలు ప్రదర్శిస్తుండడంపై ఆర్డీఓ ఆగ్రహం వ్యక్తం చేశారు.రెన్యువల్‌ చేయించుకోకుండా సినిమాలు ప్రదర్శించడం, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.కేసు నమోదు చేశారు.థియేటర్‌ సీజ్‌ చేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...