ఆస్తి పన్నుకు మాత్రమే 50శాతం వడ్డీ మాఫీ...

ఈ నెలాఖరులోగా ఏకమొత్తంలో చెల్లిస్తేనే వర్తింపు...

సెలవు దినాల్లో సైతం పన్ను వసూళ్లు..

ఆర్.జి.వి.క్రిష్ణ,నగరపాలక అదనపు కమిషనర్...

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

భవనాలు,ఖాళీ స్థలాలపై ఉన్న బకాయిలకు మాత్రమే 50శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ స్పష్టం చేశారు.బుధవారం ఆయన నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూళ్లు కేంద్రాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భవనాలు,ఖాళీ స్థలాలకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పాటు,పాత బకాయిలన్నీ ఏక మొత్తంలో చెల్లిస్తేనే 50శాతం వడ్డీ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.ఇప్పటికే వడ్డీతో చెల్లించిన బకాయిదారులకు,వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్దుబాటు చేయడం జరుగుతుందన్నారు.ఈ నెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని,ఆదివారం ఉగాది,సోమవారం రంజాన్ దినాల్లో సైతం పన్ను వసూళ్లు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు తెరిచే ఉంటాయన్నారు.ఈ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా పన్ను చెల్లింపుదార్ల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని, కావున బకాయిదారులు చివరి వరకు వేచి ఉండొద్దని సూచించారు.సత్వరమే పన్నులు చెల్లించి,50శాతం వడ్డీ రాయితీ పొందాలని అదనపు కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ యన్.చిన్నరాముడు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....