గొందిపర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి...సిపిఎం డిమాండ్...
VS9TV న్యూస్,కర్నూలు మండలం :
కర్నూలు మండలం,గొందిపర్ల గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం మండల నాయకులు రాఘవేంద్ర, సీనియర్ నాయకులు ఆంజనేయులు డిమాండ్ చేశారు.మంగళవారం ప్రజా చైతన్య యాత్ర గొందిపర్ల గ్రామంలో వీధి వీధిన తిరిగి,అలాగే ఇందిరమ్మ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.గొందిపర్ల గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయాయని చెప్పారు.డ్రైనేజీ నిర్మాణం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందన్నారు.ప్రతిరోజు శుభ్రమైన మంచినీరు అందించడం లేదని విమర్శించారు.ప్రచారం సందర్భంగా అనేకమంది కొత్త పెన్షన్ల కోసం ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నామని తెలియజేశారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం, తల్లికి వందనం పేరుతో ఇస్తామన్న సహాయం,ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇస్తామన్న రూ.1500 నిరుద్యోగ భృతి,మెగా డీఎస్సీ,ఎస్సై,కానిస్టేబుల్ సమస్యల పరిష్కారం చేసి,వారికి ఉద్యోగాలు అలాగే ఇళ్ల స్థలాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నా జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ,వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి,మునిస్వామి,శివ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Post a Comment