పండుగ రోజుల్లో సైతం పన్నులు చెల్లించవచ్చు...

50శాతం వడ్డీ రాయితీ ఈ నెల 31తో ముగింపు...

ఉదయం 9-00 నుండి రాత్రి 9-00వరకు పన్ను వసూళ్లు...

నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ వెల్లడి...

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

ఉగాది,రంజాన్ పండుగ రోజులు ఈ నెల 30, 31వ తేదీల్లో సైతం ఆస్తి పన్ను,తాగునీటి కొళాయి చార్జీలను ప్రజలు చెల్లించవచ్చని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి.క్రిష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.50శాతం వడ్డీ రాయితీని ప్రజలు అధిక సంఖ్యలో వినియోగించుకుంటున్నారని,సెలవు దినాల్లో సైతం పన్నులను చెల్లించవచ్చని సూచించారు.ఆది,సోమవారాల్లో ఉదయం 9-00 గంటల నుండి రాత్రి 9-00 వరకు నగరపాలక కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రంతో పాటు నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సైతం పన్నులు చెల్లించవచ్చన్నారు.అదేవిధంగా ప్రజలు ఇంటి నుంచే పన్నులను డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా చెల్లించవచ్చని, వాట్సాప్ నెంబర్ 9552300009, పురసేవ యాప్,వెబ్‌సైట్ https://cdma.ap.gov.in/en/ptpayments లలో చెల్లించవచ్చని అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ వెల్లడించారు.

ప్రత్యేక కౌంటర్లు :

1. కల్లూరు వార్డు కార్యాలయం - 85వ సచివాలయం 
2. జె.యన్.ఆర్.నగర్ (రైతు బజార్ సమీపంలో) - 62వ సచివాలయం)
3. బాలాజీ నగర్ - 104వ సచివాలయం

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...