ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు...ఎస్ టియు
ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిర్లక్ష్యం తగదు...ఎస్ టియు
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
రాష్ట్రంలో నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం తగదని,ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్ టియు జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవనంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు ఎస్.గోకారి మాట్లాడుతూ నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినప్పటికీ 12వ పిఆర్సి నియామకం,మద్యంతర భృతి,పెండింగ్ బకాయిలు,పెండింగ్ డిఏలు,సరెండర్ బకాయిలు,ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఉందని ఇది తగదని అన్నారు.పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులు ఉపాధ్యాయులలో తీవ్రఅసంతృప్తి నెలకొందని చెప్పారు.గత తొమ్మిది నెలల నుండి విద్యా సంస్కరణల పేరుతో ఉపాధ్యాయుల సమస్యలను నిర్లక్ష్యం చేశారన్నారు.ప్రభుత్వం వెంటనే 12వ పి ఆర్ సి చైర్మన్ నియామకం చేపట్టాలని, 30శాతం మభ్యంతర భృతి ప్రకటించాలని,పెండింగ్ డీఏలు,పెండింగ్ బకాయిలు,సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని,సిపిఎస్ జిపియస్ లను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని,జీఓ నెంబర్ 117రద్దు తదనంతరం ఏర్పాటు చేయబోయే అన్ని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు నడపాలని,అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలను యధాతధంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పదవ తరగతి పరీక్షల విధులలో ఉన్న సిఎస్,డిఓ,ఇన్విజిలేటర్లను చిన్న చిన్న కారణాలతో సస్పెండ్ చేయడం తగదన్నారు.పదవ తరగతి మూల్యాంకన విధుల నుండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మేమో 57ను అమలు చేయాలని,పాఠశాల సహాయకులకు జూనియర్ లెక్చరర్ గా పదోన్నతులు కల్పించాలని,1998,2008 యంటియస్ ఉపాధ్యాయుల పదవి విరమణ వయసును 62సంవత్సరాలకు పెంచాలని,దశలవారీగా వారిని క్రమ బద్దీకరణ చేయాలని,ఏప్రిల్,మే నెలలో జరగబోయే బదిలీలు,పదోన్నతులు పారదర్శకంగా జరపాలని కోరారు. కస్తూర్బా ఉపాధ్యాయులకు ఎంటిఎస్ విధానాన్ని వెంటనే అమలు చేసి, దశలవారీగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కే.జనార్దన్,మాజీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ షఫీ,ఉపాధ్యాయ కన్వీనర్ దేవదాసు,సీనియర్ నాయకులు ఇస్మాయిల్ సాహెబ్,అబ్దుల్ రహీం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment